నిండు గర్భిణికి కరోనా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే..

ABN , First Publish Date - 2020-07-16T17:38:26+05:30 IST

జిల్లాలో కరోనా ఊహించని స్థాయిలో విజృంభిస్తోంది. కంటికి కనిపించకుండా మనుషులపై దాడి చేస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూ కలవరపెడు తోంది. ఎటువైపు నుంచి ఎలా వస్తుందో అర్థంకాక ప్రజలను ఆందోళనకు

నిండు గర్భిణికి కరోనా.. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యలోనే..

కామారెడ్డి జిల్లాలో వైరస్‌ ఉధృతి

జిల్లాలోని అన్ని మండలాల్లో రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా పాజిటివ్‌ కేసులు

కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా 8 మంది మృతి

మంగళవారం రాత్రి కరోనా బారిన పడి నిండు గర్భిణి మృతి

అన్నిరంగాల వారికి సోకుతున్న కరోనా వైరస్‌


కామారెడ్డి (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ఊహించని స్థాయిలో విజృంభిస్తోంది. కంటికి కనిపించకుండా మనుషులపై దాడి చేస్తోంది. చిన్న, పెద్ద తేడా లేకుండా అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతోంది. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతూ కలవరపెడు తోంది. ఎటువైపు నుంచి ఎలా వస్తుందో అర్థంకాక ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కరోనా ప్రభావం ప్రారంభమైనప్పటి నుంచి కేవలం కామారెడ్డి, బాన్సువాడ ప్రాంతాల్లోనే తన ప్రభావం చూపినప్పటికీ ప్రభుత్వం, అధికారుల చర్యల వల్ల కట్టడిలోకి వచ్చింది.


తీరా లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత జిల్లాలో మొదట పట్టణ ప్రాంతాలలోనే కేసుల సంఖ్య పెరుగుతూ రాగా ప్రస్తుతం జిల్లాలోని అన్ని మండలాల్లో రోజు రోజుకూ కరోనా వైరస్‌ ప్రభావం పెరుగుతూ వస్తోంది. లాక్‌డౌన్‌  కంటే ముందు కరోనా భారిన పడిన ఎక్కడ కూడా మరణాలు సభవించలేదు. కానీ ఇటీవల మరణాలు సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే కామారెడ్డి, బాన్సువాడ, రాజంపేట, భిక్కనూర్‌, నిజాంసాగర్‌లో మరణా లు సంభవించినప్పటికీ మంగళవారం కామారెడ్డి పట్టణంలోని ఇస్లాం పుర ప్రాంతంలో ఓ నిండు గర్భిణితో పాటు గాంధారి మండలంలో ఓ వృద్ధుడు మరణించడంతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తుతున్నా యి. అయితే ప్రజలు తమ వంతు బాధ్యతగా కరోనా భారినపడకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటూ లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తే కరోనాను కట్టడి చేయవచ్చని జిల్లా వైద్యాధికారులు పేర్కొంటున్నారు.


ఉధృతమవుతున్న వైరస్‌

జిల్లాలో రోజు రోజుకూ వైరస్‌ ఉధృతమవుతూ ప్రజలను భయాందోళ నకు గురి చేస్తోంది. కరోనా వైరస్‌ ప్రభావం అయినప్పటి నుంచి ముం దుడి పోరాటం చేస్తూ ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పిస్తున్న వైద్యసిబ్బంది తో పాటు విద్య, రెవెన్యూ, ఫారెస్ట్‌, బ్యాంకు అధికారులతో పాటు అప్పుడే పుట్టిన చిన్నారుల నుంచి వృద్ధుల వరకు సోకుతూ ప్రజల ఆరోగ్యాన్ని క్షీణింపచేయడంతో పాటు ప్రాణాలను సైతం హరించి వేస్తోంది. ఇప్పటి వరకు జిల్లాలో మెడికల్‌ ఆఫీర్లకు, జిల్లా విద్యాశాఖలో ఓ విభాగంలో పని చేస్తున్న ఉన్నతాధికారి, ఫారెస్ట్‌ అధికారికి, రెవెన్యూ అధికారికి, బ్యాం కు మేనేజర్‌లకు సోకుతూ అందరిని కలవరానికి గురిచేస్తోంది. మొదట్లో జిల్లా కేంద్రంతో పాటు బాన్సువాడలో వైరస్‌ ప్రభావం ఉండగా ప్రస్తు తం 22మండలాల్లో భిక్కనూర్‌, రాజంపేట, దోమకొండ, బీబీపేట, సదాశి వనగర్‌, గాంధారి, ఎల్లారెడ్డి, తాడ్వాయి, జుక్కల్‌, బిచ్కుంద, మాచారెడ్డి, పెద్దకొడప్‌గల్‌, మద్నూర్‌, పిట్లం, బీర్కూర్‌, నస్రూల్లాబాద్‌, నాగిరెడ్డిపేట, రామారెడ్డి, నిజాంసాగర్‌లలో వైరస్‌ భారిన పడిన వారు ఉన్నారు. అయి తే లింగంపేటలో మాత్రమే ఇప్పటి వరకు ఏ కేసు నమోదు కాలేదు.


రోజురోజుకూ పెరుగుతున్న మృతుల సంఖ్య

జిల్లాలో కరోనా మహమ్మారి భారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం  నలుగురు మృతి చెందినట్లు వైద్యఆరోగ్యశాఖ అధికారులు వెల్ల డిస్తున్నారు. అయితే కరోనా వైరస్‌ వల్ల మరో నలుగురు చనిపోయిన ట్లు తెలుస్తోంది. దీంతో జిల్లాలో మృతుల సంఖ్య 8కి చేరింది. అధి కారిక లెక్కల ప్రకారం కామారెడ్డి పట్టణంలో ఇద్దరు, గాంఽధారి ఒక్కటి, రాజంపేట ఒక్కరు మృతి చెందినట్లు అధికారులు తెలియజేస్తున్నారు. కానీ కామారెడ్డి, భిక్కనూర్‌, బాన్సువాడ, నిజాంసాగర్‌ ప్రాంతాల్లో ఒక్కొ క్కరు చొప్పున మరణించినట్లు సమాచారం. ఇందులో చాలా వరకు దీర్ఘ కాలిక ఆరోగ్యసమస్యలతో ఇబ్బందులు పడుతూ కరోనా భారిన పడి చని పోతున్నట్లు తెలుస్తోంది.


కాగా మంగళవారం అర్థరాత్రి కామారెడ్డి పట్ట ణానికి చెందిన నిండు గర్భిణి మృతి చెందడంతో పట్టణంలో తీవ్ర అలజ డి నెలకొంది. నాగిరెడ్డిపేట మండలం గోపాల్‌పేట గ్రామానికి చెందిన ఓ గర్భిణి మహిళ రెగ్యులర్‌ చెకప్‌లో భాగంగా కామారెడ్డిలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి రాగా పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమెకు కరోనా లక్షణా లు కనపడడంతో జిల్లా కేంద్ర ఆసుపత్రికి రక్తనమూనాల సేకరణ కోసం పంపారు. తీరా రక్త నమూనాలు పంపిన తర్వాత ఫలితాల్లో ఆమెకు పాజిటివ్‌ రావడంతో గత వారం రోజులుగా కామారెడ్డిలోని తన తల్లిగారి ఇంటి వద్దనే హోం క్వారంటైన్‌లో ఉంటూ కరోనా చికిత్స తీసుకుంటుంది. మంగళవారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కాగా వైద్యులు హైదరాబాద్‌ రిఫర్‌ చేయడంతో మార్గమధ్యలోనే రామాయంపేట వద్ద మృతి చెందిం ది. గాంధారి మండలంలో సైతం ఓ వృద్ధుడి దీర్ఘకాలిక వ్యాధితో బాధప డుతూ కరోనా భారిన పడి మృతి చెందాడు. నిజాంసాగ ర్‌ మండలం మల్లూర్‌ గ్రామానికి చెందిన 24 సంవత్సరాల యువకుడు గాంధీ ఆస్ప త్రిలో కరోనా వ్యాధి సోకి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందినట్లు సమాచారం. 


అప్రమత్తతతోనే కట్టడి  చేయవచ్చంటున్న వైద్యులు

ప్రజల అప్రమత్తత, సహకారంతోనే కరోనా కట్టడి అవకాశం ఉంటుం దని వైద్యులు పేర్కొంటున్నారు. ప్రజలు అవసరమైతేనే ఇంట్లోంచి బయ టకు రావాలని, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తు లు, చిన్నారులు సాధ్యమైనంత వరకు ఇంటికే పరిమితమవ్వాలని సూచి స్తున్నారు. జిల్లాలో ఇంకా చాలా వరకు పండుగలు అంటూ, ఫంక్షన్‌లు అంటూ అవసరం లేకపోయినా గుమిగూడడం లాంటివి చేస్తున్నారని అవి మానుకుంటే సామాజిక వ్యాప్తి చెందకుండా అరికట్టవచ్చని అంటు న్నారు. ప్రజలు అత్యవసరమైతేనే ఇంటి నుంచి బయటకు రావాలని వచ్చిన భౌతిక దూరం పాటిస్తు, మాస్క్‌లు ధరిస్తు, ఎప్పటికప్పుడు చేతు లను శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటూ ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా వైద్యులను సంప్రదించి చికిత్సను తీసుకోవాలని పేర్కొంటు న్నారు. కొందరు సొంత వైద్యానికి ప్రాధాన్యత నిస్తూ వైరస్‌ ప్రభావం తీవ్ర స్థాయికి చేరిన తర్వాత వైద్యులను సంప్రదిస్తున్నారని దీనివల్ల వారితో పాటు మరికొందరికి వైరస్‌ను అంటిస్తూ వారిని కరోనా భారిన పడేలా చేస్తున్నారని అంటున్నారు. ప్రజలు స్వతాహాగా కట్టడి చర్యలు చేపట్టినప్పుడే కరోనా వైరస్‌ ప్రభావాన్ని తగ్గించే అవకాశాలు ఉంటాయని ఇప్పటికైన కరోనా కట్టడికి తమ వంతు బాధ్యతగా ఇంట్లోనే ఉంటూ కరోనా వైరస్‌ కట్టడికి సహకరించాలని కోరుతున్నారు.


జిల్లాలో 28 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

జిల్లాలో బుధవారం 28 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు సమాచారం. మంగళవారం సాయంత్రం 5గంటల నుంచి బుధవారం సాయంత్రం 5 గంటల వరకు  21 కేసులు నమోదు అయినట్లు డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌ తెలిపారు. అయితే జిల్లాలో ఇప్పటి వరకు 46 మంది చికిత్స పొంది డిశ్చార్జ్‌ అయ్యారని, బాన్సువాడ ఏరియా ఆసుపత్రి నుంచి మరో 86మంది రక్తనమూనాలు పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు. కాగా రాత్రి వరకు గతంలో సేకరించిన రక్త నమూనాలకు సంబంధించిన ఫలితాలు విడుదలయినట్లు సమాచారం. ఇందులో జిల్లాలో మొత్తం 28 కరోనా పాజిటివ్‌ కేసులు రాగా కామారెడ్డి పట్టణంలో 18, రామారెడ్డి మండలం 1, బాన్సువాడ 3, బీర్కూర్‌ 2, మద్నూర్‌ 1, బిచ్కుంద 1, ఎల్లారెడ్డి 1, నిజామాబాద్‌ జిల్లాకు చెందిన మైగ్రేంట్‌ 1 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు తెలిసింది.


ప్రభుత్వ వైఫల్యంతో రెండు ప్రాణాలు పోయాయి

ప్రభుత్వం కరోనా బాధితులకు ఎలాంటి సదుపాయం కల్పించడం లేదని కామారెడ్డిలో ప్రభుత్వ వైఫల్యంతో కరోనా వైరస్‌ సోకి రెండు ప్రాణాలు పోయాయని మాజీ మంత్రి షబ్బీర్‌అలీ విమర్శించారు. బుధవారం కామా రెడ్డి జిల్లా కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం తో అమాయక ప్రజలు పిట్టల్లా రాలుతున్నారని విమర్శించారు. కామారెడ్డిలో కరోనా పాజిటివ్‌ ఉన్న నిండు గర్భిణి పురిటి నొప్పు లతో నరకయాతన అనుభవించి తల్లి, బిడ్డ మృతి చెందిందన్నారు. కరోనా వచ్చిన వారి సంఖ్యను తగ్గించి మరణాలను దాచిపెడు తూ చూపిస్తే కరోనా తగ్గదని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి హెల్త్‌ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్‌ చేశారు.

షబ్బీర్‌అలీ, మాజీ మంత్రి

Updated Date - 2020-07-16T17:38:26+05:30 IST