కామారెడ్డి జిల్లాలో 96 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

ABN , First Publish Date - 2020-08-13T18:41:13+05:30 IST

కామారెడ్డి జిల్లాలో బుధవారం 96 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు సమాచారం. జిల్లాలోని ఆయా పీహెచ్‌సీ, సీహెచ్‌సీల పరిధిలో నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షలలో 52 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు తెలిసింది.

కామారెడ్డి జిల్లాలో 96 కరోనా పాజిటివ్‌ కేసుల నమోదు

కామారెడ్డి టౌన్‌(ఆంధ్రజ్యోతి): కామారెడ్డి జిల్లాలో బుధవారం 96 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు సమాచారం. జిల్లాలోని ఆయా పీహెచ్‌సీ, సీహెచ్‌సీల పరిధిలో నిర్వహించిన ర్యాపిడ్‌ పరీక్షలలో 52 పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు తెలిసింది. ఇందులో జిల్లా కేంద్ర ఆసుపత్రి 1, రాజివ్‌నగర్‌ 12, దేవుని పల్లి 18, బాన్సువాడ 2, ఎల్లారెడ్డి 6, గాంధారి 1, లింగంపేట 3, మత్తమాల్‌ 3, రాజంపేట 3,  భిక్కనూర్‌ 2,  బీర్కూర్‌ 1 కేసులు నమోదయ్యాయి. కాగా ఎల్లారెడ్డి ఆసుపత్రి నుంచి పంపిన శాంపిళ్లలో 24 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలిసింది. అంతేకాకుండా కామారెడ్డి, బాన్సువాడ ఆసుపత్రి పరిధిలో మంగళవారం మిగిలిన శాంపిళ్ల ఫలితాలలో మరో 20 పాజి టివ్‌ కేసులు వచ్చినట్లు సమాచారం.


లింగంపేటలో ముగ్గురికి..

లింగంపేట మండలంలో బుధవారం 26 మంది ప్రాథమిక కాంటాక్ట్‌ల కు పరీక్షలు నిర్వహించగా మండలంలోని మెంగారంలో ఇద్దరికి, ఎక్కపల్లి లో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు సాయికుమార్‌ తెలిపారు. 


గాంధారిలో ఒకరికి..

గాంధారి మండల కేంద్రంలో ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తి ఎవరితో కలిశార నే దానిపై వివరాలు సేకరిస్తున్నామన్నారు. వారికి సైతం లక్షణాలు కనిపి స్తే పరీక్షలు నిర్వహించి మందులు అందజేస్తామని తెలిపారు. 


భిక్కనూరులో ఐదుగురికి 

భిక్కనూరు, రాజంపేట ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల పరిధిలో ని రెండు గ్రామాల్లో ఐదుగురికి కొవిడ్‌ నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు రవీందర్‌, శిరీష్‌కుమార్‌ మంగళవారం తెలిపారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ భిక్కనూరు మండలకేంద్రంలో ఇద్దరికి, జంగంపల్ల్లి గ్రామాని కి చెందిన ముగ్గురికి పాజీటీవ్‌ నిర్దారణ అయిందని తెలిపారు. 


బీర్కూర్‌లో ఐదు..

బీర్కూర్‌ మండలంలో ఐదు పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు మండల వైద్యాధికారి రవిరాజా తెలిపారు. బీర్కూర్‌లో ముగ్గురికి, బైరాపూర్‌లో ఒకరికి, చించొల్లిలో ఒకరికి, మొత్తం ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన తెలిపారు. 


నస్రుల్లాబాద్‌లో నాలుగు..

నస్రుల్లాబాద్‌ మండలంలోని కంశెట్‌పల్లి గ్రామంలో రెండు, నెమ్లి గ్రా మంలో రెండు కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు మెడికల్‌ ఆఫీసర్‌ రవిరాజా తెలిపారు.

Updated Date - 2020-08-13T18:41:13+05:30 IST