ప్రకాశం జిల్లాలో కొత్తగా 681మందికి పాజిటివ్.. ఆరుగురు మృతి

ABN , First Publish Date - 2020-08-13T15:30:02+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ..

ప్రకాశం జిల్లాలో కొత్తగా 681మందికి పాజిటివ్.. ఆరుగురు మృతి

కొవిడ్‌ కల్లోలం

ఒంగోలులో అత్యధికంగా 182 కేసులు

వైద్యశాలల నుంచి 57 మంది డిశ్చార్జి


ఒంగోలు(ప్రకాశం): జిల్లాలో కొవిడ్‌ కల్లోలం సృష్టిస్తోంది. పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. పల్లె, పట్టణం.. చిన్నా,పెద్ద అన్న తేడా లేకుండా అందరూ వైరస్‌ బారిన పడుతున్నారు. ఇప్పటికే పాజిటివ్‌ కేసులు పదివేలు దాటాయి.  బుధవారం మరో సారి భారీగా నమోదయ్యాయి. ఒక్కరోజే 681 పాజిటివ్‌లు వెలుగు చూశాయి. అందులో ఒంగోలులో అత్యధికంగా 182 ఉన్నాయి. కందుకూరు 79, చీరాల 29, మార్కాపురం, అద్దంకి ఏడు కేసులు వెలుగు చూశాయి.  నగరంలో ఇన్ని కేసులు రావడం ఇదే ప్రథమం. జిల్లావ్యాప్తంగా ఇప్పటి వరకూ 2045 పాజిటివ్‌ బాధితులు చికిత్స పొందుతు న్నారు. వారిలో రిమ్స్‌లో 584, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో 1318, కిమ్స్‌లో 72, సంఘమిత్రలో 75, నల్లూరి నర్సింగ్‌ హోంలో 35, వెంకటరమణ నర్సింగ్‌ హోంలో 26, ప్రకాశం ఆసుపత్రిలో 25 ఉన్నారు. 57 మంది కోలుకుని ఇంటికి వెళ్లారు. ఆరుగురు కరోనా బాధితులు మరణించారు. మరో 27 మం ది హోమ్‌ క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. 


Updated Date - 2020-08-13T15:30:02+05:30 IST