కరోనా నుంచి కోలుకున్న వారం రోజుల తర్వాత అతడికి..

ABN , First Publish Date - 2020-08-14T18:59:33+05:30 IST

కరోనా ఉధృతి కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైరస్‌ విజృంభి స్తుండడంతో ప్రజలు తీవ్ర అందోళన చెందుతున్నారు. గురువారం రాజన్న

కరోనా నుంచి కోలుకున్న వారం రోజుల తర్వాత అతడికి..

ఆగని కరోనా ఉధృతి.. తాజాగా ఒకరి మృతి.. 54 మందికి పాజిటివ్‌


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల): కరోనా ఉధృతి కొనసాగుతోంది. జిల్లా వ్యాప్తంగా వైరస్‌ విజృంభి స్తుండడంతో ప్రజలు తీవ్ర అందోళన చెందుతున్నారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట మండలానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి కరోనా బారిన పడి హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతిచెందాడు. గత నెల 25న డయాలసిస్‌ కోసం కరీంనగర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా కరోనా వైరస్‌ సోకింది. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లాడు. చికిత్స పొంది తిరిగివచ్చాడు. వారం రోజుల క్రితం మళ్లీ అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. జిల్లాలో ఇప్పటి వరకు కొవిడ్‌ బారిన పడి 18 మంది మృతి చెందారు. గురువారం తాజాగా 54 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 


ఇందులో 34 ర్యాపిడ్‌ టెస్టులలో పాజిటివ్‌గా తేలింది. జిల్లాలో ఇప్పటి వరకు 5,264 మందికి పరీక్షలు జరుపగా 1,432 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇందులో 310 మంది కోలుకోగా 1,103 మంది చికిత్స పొందుతున్నారు. కరోనా విజృంభిస్తుండడంతో మండలాల్లో ర్యాపిడ్‌ టెస్టులు పెంచాలని చూస్తున్నారు. మరో వైపు మండలాల్లో ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. 


ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులోని మార్కెటు గోదాం లో 30 మందికి ర్యాపిడ్‌ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీర్నపల్లి మండల కేంద్రంలో ఇద్దరికి, ము స్తాబాద్‌ మండలం నామాపూర్‌కు చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.

Updated Date - 2020-08-14T18:59:33+05:30 IST