Abn logo
Jun 14 2021 @ 11:48AM

దేశంలో కరోనా కేసులు 70వేల లోపే..మరణాలు 4వేలకు చేరువలో..

ఢిల్లీ: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కేసులు తగ్గినా..కరోనా మరణాలు మాత్రం తగ్గకపోవడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశంలో 70,421 కరోనా కేసులు నమోదు కాగా, కరోనాతో 3,921 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం 2,95,10,410కి కరోనా కేసులు చేరాయి. ఇప్పటి వరకు మొత్తం 3,74,305 మంది కరోనా మరణించారు. ప్రస్తుతం దేశంలో 9,73,158 యక్టీవ్ కేసులు ఉండగా..,2,81,62,947 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 95.26 శాతం, మరణాల రేటు 1.26 శాతం ఉన్నట్లు..సోమవారం వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ వెల్లడించింది.