కరోనా చికిత్స పొందుతున్న మహిళ.. ఆస్పత్రి నుంచి తప్పించుకునే ప్రయత్నం.. చివరకు..

ABN , First Publish Date - 2020-07-14T19:45:13+05:30 IST

జామాబాద్‌ జిల్లాలో సోమవారం ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ఈ కేసులు నగరం పరిధిలోని మహాలక్ష్మినగర్‌, మారుతినగర్‌, సంజీవయ్యనగర్‌,

కరోనా చికిత్స పొందుతున్న మహిళ.. ఆస్పత్రి నుంచి తప్పించుకునే ప్రయత్నం.. చివరకు..

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మరో ఎనిమిది కేసులు

కల్లూర్‌లో ఒకరికి కరోనా పాజిటివ్‌

బోధన్‌లో 11 మంది పోలీస్‌ సిబ్బంది హోంక్వారంటైన్‌

నిజామాబాద్‌ జిల్లాలో నిత్యం పెరుగుతున్న  కేసులు


నిజామాబాద్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): నిజామాబాద్‌ జిల్లాలో సోమవారం ఎనిమిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధి కారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. ఈ కేసులు నగరం పరిధిలోని మహాలక్ష్మినగర్‌, మారుతినగర్‌, సంజీవయ్యనగర్‌, న్యూహౌజింగ్‌బోర్డు కాలనీ, సీతారాంనగర్‌ ప్రాంతాల్లో నమోదయ్యాయన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 248 కి చేరిందన్నారు. అలాగే సోమవారం కరోనాతో ఒకరు మృతిచెందారని తెలిపారు. కరోనాతో జిల్లాలో మొత్తం ఇప్పటి వరకు పది మంది మృతిచెందారన్నారు. మరో 58 శాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రబలుతున్నాయి. అన్ని చోట్లా కేసులు వస్తున్నాయి. ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగులు కూడా కరోనా బారిన పడ్డారు. పోలీసు, వైద్య ఆరోగ్య శాఖ, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల అధికారులు, ఉద్యోగులకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ప్రజల్లో కూడా ఎక్కువ మంది వ్యాపారులు, ఇతరులకు వ్యాపిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో పలు కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల ఈ కేసుల సంఖ్య పెరుగుతోంది. జిల్లాలో కరోనా కట్టడికి అందరూ కృషిచేస్తే తప్ప పరిస్థితి మెరుగయ్యేలా కనిపించడం లేదు. 


కల్లూర్‌లో ఒకరికి కరోనా

కోటగిరి: కోటగిరి మండలం కల్లూర్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(50)కి కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఎస్సై మశ్చ్యేందర్‌రెడ్డి తెలిపారు. ఆ వ్యక్తి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. ఇటీవల అతనికి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించగా పాజిటి వ్‌ వచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని ఎస్సై పేర్కొన్నారు. అతని కుటుంబ సభ్యులను హోం క్వా రంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచించారు.  


బోధన్‌ ఆర్టీసీ, పోలీస్‌శాఖలో ఆందోళన

బోధన్‌లో కరోనా కష్టకాలం మొదలైంది. గత ఐదు రోజులుగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగుచూస్తుండడం ప్రభుత్వ శాఖల్లో ఆందోళన కలిగిస్తోంది. నాలుగు రోజుల క్రితం బోధన్‌ ఆర్టీసీ డిపోలో నలుగురు సిబ్బందికి కరోనా పాజిటివ్‌ రావడం, తాజాగా పోలీస్‌శాఖలో ఓ ఎస్సైకి కరోనా పాజిటివ్‌ రావడం అటు ఆర్టీసీని, ఇటు పోలీస్‌శాఖను కలవరానికి గురి చేస్తోంది. బోధన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తూ గత 15 రోజులుగా పట్టణ శివారులలో ప్రధాన కూడళ్లల్లో వాహనాలకు జరిమానా లు విధించే విధుల్లో ఆయన కొనసాగారు. ఆయన తోపాటు ఓ ఏఎస్సై, నలుగురు స్పెషల్‌ పార్టీ సిబ్బంది, మరో ఐదుగురు పోలీసులు విదులు నిర్వహించారు. ఎస్సైకి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆయనతోపాటు విధుల్లో పాల్గొన్న 11 మంది సిబ్బందిని హోంక్వారంటైన్‌లో ఉంచారు. ఎస్సైతో పాటు విధుల్లో ఉన్న ప్రైమరీ కాంటాక్ట్‌లను సెంకడరీ కాంటాక్ట్‌లను పోలీసులు గుర్తించారు. వా రందరిని హోం క్వారంటైన్‌లో ఉండేలా చర్యలు చేపట్టారు. దీంతో బోధన్‌లోని ప్రభుత్వ శాఖల్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతుండడం భయాందోళనలు కలిగిస్తోంది. 


కరోనా పేషెంట్‌ పరారీకి యత్నం

కరోనా వైరస్‌ సోకి జిల్లా జనరల్‌ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న ఓ బాధితురాలు సోమవారం ఆసుపత్రి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది. తాను చికిత్స పొందుతున్న వార్డు నుంచి బయటకు వచ్చి రోడ్డుపైకి వెళుతుండగా  సెక్యూరిటీ సిబ్బంది ఆమెను గమనించి, తిరిగి వార్డులోకి తీసుకువెళ్లారు. జిల్లాలో కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న తరుణంలో చికిత్సపొందుతున్న మహిళ ఆసుపత్రి నుంచి పరారీకి యత్నించడం కలకలం సృష్టించింది. 

Updated Date - 2020-07-14T19:45:13+05:30 IST