జాగ్రత్తలతోనే కరోనా దూరం

ABN , First Publish Date - 2021-04-20T04:48:06+05:30 IST

ప్రభు త్వ నిబంధనల ప్రకారం ప్రతిఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌కు గురికాకుండా ఉండవచ్చని తహసీల్దార్‌ బి.శివశంకర్‌ సత్యనారాయణ అన్నారు. పెద్దకొల్లివలస గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, వైద్యసిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహిం చారు.

జాగ్రత్తలతోనే కరోనా దూరం
ఎల్‌ఎన్‌పేట: మాట్లాడుతున్న తహసీల్దార్‌ సత్యనారాయణ


పెద్దకొల్లివలస(ఎల్‌.ఎన్‌.పేట), ఏప్రిల్‌ 19: ప్రభు త్వ నిబంధనల ప్రకారం ప్రతిఒక్కరూ వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కరోనా వైరస్‌కు గురికాకుండా ఉండవచ్చని తహసీల్దార్‌ బి.శివశంకర్‌ సత్యనారాయణ అన్నారు. పెద్దకొల్లివలస గ్రామ సచివాలయంలో సచివాలయ సిబ్బంది, రెవెన్యూ, వైద్యసిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహిం చారు. సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి ఎల్‌.తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా రెండో దశ వ్యాప్తి చెందుతుండడంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అర్హులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయడం జరుగుతుందని మండల ప్రత్యేకాధికారి కె.రామారావు తెలిపారు. లక్ష్మీనర్సుపేట పీహెచ్‌సీలో సోమవారం వాక్సినేషన్‌ ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో  ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు, వైద్యాధికారులు రెడ్డి హేమ లత, టి.ప్రవల్లిక, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.


కరోనాతో మహిళ మృతి

ఎల్‌.ఎన్‌.పేట: మండలంలోని ఓ గ్రామంలో ఒకరు (మహిళ) కరోనాతో సోమవారం ఉదయం మృతి చెందారు. బాధితురాలు ఈనెల 12న కరోనా వ్యాధి బారినపడినట్లు మం డలస్థాయి అధికారులు గుర్తించి శ్రీకాకుళం రిమ్స్‌లో మెరుగైన వైద్యంకోసం చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిందని తహసీల్దార్‌ బీఎస్‌ఎస్‌ సత్యనారాయణ, ఎంపీడీవో ఆర్‌.కాళీప్రసాదరావు తెలిపారు. 


పదో తరగతి విద్యార్థినికి పాజిటివ్‌ 

మెళియాపుట్టి: మండలంలోని ఓ ప్రధాన గ్రామంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో ఒక విద్యార్థినికి  కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని వైద్యాధికారి జి.గణపతిరావు తెలిపారు. మంగళవారం చాపరలో కరోనా పరీక్షలు చేపట్టగా ఈ విద్యార్థినికి పాజిటివ్‌ వచ్చినట్లు గుర్తించామన్నారు.  


హైదరాబాద్‌ నుంచి వచ్చిన యువకుడికి..

వంగర: మండల పరిధిలోని ఒక గ్రామంలో యువకుడికి కరోనా సోకినట్లు ఎంపీడీవో త్రినాథులు సోమవారం తెలిపారు. ఈ యువకుడు ఇటీవల హైదరాబాద్‌ నుంచి గ్రా మానికి వచ్చినట్లు చెప్పారు. నాలుగు రోజులుగా తీవ్ర జ్వరం రావడంతో వైద్యాధికారి రాజీవ్‌ పరీక్షల చేసి కరోనా పాజిటివ్‌గా గుర్తించారన్నారు.  అరసాడ, వంగర, కొప్పర తదితర గ్రామాల్లో వైద్యపరీక్షలు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. 


మండలంలో 15 కేసులు

పోలాకి: పోలాకి మండలంలో కరోనా సెకెండ్‌ వేవ్‌ కేసులు పెరిగిపోతున్నాయి. ఇంతవరకూ 18 కరోనా కేసులు నమోదుకాగా సోమవారం ఒక్కరోజే మరో 15 కేసులు నమోదైనట్లు తహసీల్దార్‌ ఎ.సింహాచలం తెలిపారు. వైద్యాధికారి ముద్దాడ ఝాన్సీరాణి మాట్లాడుతూ.. మాస్క్‌ ధరించడం, భౌతికదూరం, శానిటైజేషన్‌ చేసుకోవడం తప్పనిసరన్నారు. కరోనా కేసులు పెరుగుతున్నందున దుకాణాలను మూసివేసేందుకు నిర్ణయించామని తహసీల్దార్‌ తెలిపారు.

 


 

Updated Date - 2021-04-20T04:48:06+05:30 IST