కరోనా కలవరం

ABN , First Publish Date - 2021-05-17T04:18:11+05:30 IST

మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా వారం రోజులుగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు.

కరోనా కలవరం
పాన్‌గల్‌లో కరోనా పరీక్షల కోసం బారులు తీరిన ప్రజలు

ఆందోళన రేపుతున్న వైరస్‌ వ్యాప్తి

జాగ్రత్తలు, సూచనలు చేస్తున్న ప్రజాప్రతినిధులు

బాధితులకు నిత్యావసర సరుకులు అందిస్తున్న దాతలు

గోపాల్‌పేట, మే  16: మండల కేంద్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రజలు, వ్యాపారులు స్వచ్ఛందంగా వారం రోజులుగా లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. ప్రజలు బయటకు రాకుండా ఇళ్లలోనే లాక్‌ చేసుకొని జాగ్రత్తలు పాటిస్తున్నారు. సమాయానికి మించి ఎవరైన రోడ్లపై తిరుగుతూ కనిపిస్తే పోలీసులు వారిని ఇంటికి తరిమేస్తున్నారు. రోడ్లపైకి ఎవరు రాకుండా లాక్‌డౌన్‌ పాటించాలని ఎస్‌ఐ రామన్‌గౌడ్‌, పోలీసు బృందం గస్తీ కాస్తున్నారు. 


సంత బజార్‌లో కరోనా కట్టడికి కృషి

ఖిల్లాఘణపురం: వారాంతపు సంత బజార్‌లో కరోనా నివారణ, జాగ్రత్తలను మైక్‌ ద్వారా ప్రజలకు తెలియచేస్తున్నామని ప్రత్యేక అధికారి అర్జున్‌ ఆదివారం తెలిపారు. సంత బజార్‌లో గుంపులు గుంపులుగా ఉండకుండా పలు సూచనలు, సలహాలు ఇస్తున్నట్లు ఆయన వివరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సామ్య నాయక్‌, ఎస్‌ఐ వెంకటేశ్వర్‌గౌడ్‌లు మాస్క్‌లు అందజేశారు. భౌతిక దూరం పాటించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. సంత బజారులో కూరగా యలను తీసుకున్న వెంటనే వినియోగదారులు స్వస్థలాలకు తిరిగి వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్‌ ఎస్‌ఐ శృతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.  


బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు 

వనపర్తి రూరల్‌: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ షేక్‌ షఫీ హెచ్చరించారు. ఆదివారం రాజంపేట గ్రామ శివారులో లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఆరు గురిపై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మద్యం మీద ఉన్న మమకారం జీవితం మీద చూపించండని అన్నారు. నిత్యావసర సరుకుల కోసం మాత్రమే బయటికి రావా లని, ఇష్టారాజ్యంగా బయటికి వస్తే కఠిన చర్యలు ఉం టాయని హెచ్చరించారు.


ఆవిరి యంత్రాలు పంపిణీ 

వనపర్తి అర్బన్‌: పట్టణంలోని బాల సదనంలో ఎనిమిది మంది అనాథ పిల్లలకు కరోనా సోక డంతో విషయం తెలుసుకున్న మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ వాకిటీ శ్రీధర్‌ వారికి ఆవిరి యంత్రాలను పంపిణీ చేశారు. కరోనా వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతీ ఒక్కరికి ఈ విపత్కర పరిస్థితుల్లో సహాయం చేయాలని సూచించారు. 


నిత్యావసర సరుకుల పంపిణీ

పాన్‌గల్‌: మండల పరిధిలోని నిజామాబాద్‌ గ్రామానికి చెందిన పసుపుల లక్ష్మయ్యకు హర్షన్న యువసేన నియోజకవర్గ అధ్యక్షుడు రంగాపురం శివారెడ్డి నిత్యావసర సరుకులు మాస్క్‌లు ఆదివారం అందజేశారు. లక్ష్మయ్య కరోనా సోకడంతో పంపిణీ చేశారు. కా ర్యక్రమంలో హర్షన్న యువసేన బృందం పాల్గొన్నారు.


సర్పంచ్‌ రాధాకృష్ణ ఆధ్వర్యంలో..

పెద్దమందడి: మండల పరిధిలోని చీకరుచెట్టు తం డా గ్రామ పంచాయతీ, అనుబంధ తండాలలో కరోనా బారిన పడిన బాధితులకు సర్పంచ్‌ రాధాకృష్ణ ఆధ్వ ర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వస్తే భయ పడవద్దని, మనోధైర్యమే చికిత్స అని అన్నారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు ఆరోగ్య సిబ్బంది సూచనలు పాటిస్తూ ధైర్యంగా ఉండాలన్నారు. ఎవరికీ ఏ అవసరం ఉన్న తనకు సమాచారం ఇవ్వాలని సర్పంచ్‌ బాధితులకు సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన కుటుంబాలకు కూరగాయలు, పండ్లు సర్పంచ్‌ పంపిణీ చేశారు. వార్డు మెంబర్లు రమేష్‌, శంకర్‌, గ్రామ యువత బాబు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలి

పాన్‌గల్‌: కరోనా వైరస్‌ మహమ్మారి పట్ల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల ప్రాథమిక వైద్యాధికారి వంశీకృష్ణ అన్నారు. ఆదివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 50 మందికి పరీక్షలు నిర్వహించగా 11 మంది మండల ప్రజలకు ఇతరులకు ఇద్దరికి కరో నా పాజిటివ్‌ నిర్దారణ  అయిందన్నారు. ప్రతీ ఒక్కరు నిబంధనలు పాటించి కరోనా వైరస్‌ను నిర్మూలించేం దుకు సహకరించాలని కోరారు. 


అందరికీ నివారణ టీకా వేయాలి: సీపీఎం

అమరచింత: కరోనా వైరస్‌ బారిన పడిన వ్యాధిగ్రస్థులకు సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం మండల పరిధిలోని పామిరెడ్డిపల్లె, కొంకన్‌వానిపల్లెలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి జీఎస్‌ గోపి మాట్లాడుతూ కరోనా వైరస్‌ను నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని విమర్శించారు. వైరస్‌ నివారణ టీకా పంపిణీలో ప్రభుత్వాల మద్య సమన్వయంలో పించిందని దుయ్యబట్టారు. కరోనా వైరస్‌ బారిన పడి జనం చనిపోతున్నా ప్రభుత్వాలలో స్పందన కనబడడం లేదని విచారం వ్యక్తం చేశారు. నిరుపేదలకు ఉచితంగా 16 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు అన్ని వసతులను కల్పించాలని కోరారు. ఉచితంగా టీకా వేయాలని, కరోనా రోగులకు బెడ్‌, ఆక్సిజన్‌ సౌకర్యాలను కల్పించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో వెంకటేష్‌, ఆర్‌ఎన్‌. రమేష్‌, అజయ్‌, రవి, రవికుమార్‌, మహేష్‌ పాల్గొన్నారు.


కనిమెట్టలో ద్రావణం పిచికారి

కొత్తకోట: మండలంలోని కనిమెట్ట గ్రామంలో కాలనీల్లో మాజీ వైస్‌ ఎంపీపీ గుంత మల్లేష్‌ హైపోక్లోరైడ్‌ ద్రావణాన్ని పిచికారి చేయించారు. కరోనా వాప్తిని నిరోధించడంలో భాగంగా ద్రావణం పిచికారి చేస్తూ ప్రజలను మాస్కులు ధరించి బయటకు రావాలని కోరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకులు బాలరాజు, రమేష్‌, సురేష్‌ యాదవ్‌, కోటేశ్వర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, మన్యంకొండ, అంజి, ప్రతాప్‌రెడ్డి, శివాచారి, పరశురాములు కృపాకర్‌రెడ్డి పాల్గొన్నారు.


మాస్క్‌ల పంపిణీ

పట్టణంలోని మార్టిన్‌ లుతార్‌ కాన్సెప్ట్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఇంటింటికి తిరిగి మాస్కులు పంపిణీ చేశారు. కరోనా నివారణకు టీకా, మాస్కే కారణమని భావించి సర్జికల్‌ మాస్కులు పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు సంతోష్‌ రాజు తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్‌ పద్మ అయ్య న్న కార్యదర్శి శేఖర్‌, సభ్యులు శాంతిరాజు, ప్రేమదానం, ప్రియ్యన్న, మోహన్‌, సతీష్‌రాజ్‌, కిరణ్‌, దీలిప్‌, ఆరోన్‌, రాజు, జేమ్స్‌, అభి, అమర్‌, అనిల్‌, రాకేష్‌ పాల్గొన్నారు. 



Updated Date - 2021-05-17T04:18:11+05:30 IST