మరో 114మందికి కరోనా

ABN , First Publish Date - 2020-09-19T05:31:01+05:30 IST

జిల్లాలో మరో 114మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈమేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేసిన

మరో 114మందికి కరోనా

చికిత్స పొందుతూ ముగ్గురి మృతి


కరీంనగర్‌, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో మరో 114మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఈమేరకు రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొ న్నారు. శుక్రవారం జిల్లావ్యా ప్తంగా ముగ్గురు కరోనా వ్యాధిబారినపడి చికిత్స పొందుతూ మృతిచెందారు. చొప్పదండి మండలంలోని రుక్మాపూర్‌లో ఒకేరోజు ఏడుగురికి కరోనా సోకగా ఒకే ఇంట్లో ఆరుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ రావడంతో గ్రామ స్థులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. హుజురాబాద్‌ పట్టణానికి చెందిన ఓ హెల్త్‌ అసిస్టెంట్‌కు కొవిడ్‌ సోక డంతో 20రోజుల నుంచి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్ప త్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. అలాగే వీణ వంక మండలం 90సంవత్సరాల వృద్ధుడు, కొత్తపల్లి మండలానికి చెందిన 55ఏళ్ల వ్యక్తి కరీంనగర్‌ జిల్లా ప్రభుత్వ ప్రధానఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణిం చారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం 300వరకు కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. హుజురాబాద్‌ డివిజన్‌పరిధిలోని జమ్మికుంట మండ లంలో 36, హుజురాబాద్‌ మండలంలో 19, సైదాపూర్‌లో 5, ఇల్లందకుంటలో 5, వీణ వంక మండలంలో 12, శంకరపట్నం మండలంలో ఒక పాజిటివ్‌ కేసు నమో దైంది. 


కరీంనగర్‌ రెవెన్యూ డివిజన్‌లో పరిధిలోని తిమ్మాపూర్‌ మండలంలో 13మందికి, చిగురుమామిడి మండలంలో 8మందికి, గంగాధర మండలంలో ఇద్దరికి, రామడుగు మండలంలో ముగ్గురికి, చొప్పదండి మండలంలో 13మందికి,  కరీంనగర్‌రూరల్‌ మండలంలో ఒకరికి, కొత్తపల్లి మండలంలో ముగ్గురికి, మానకొండూర్‌ మండలంలో 18మందికి వ్యాధి నిర్ధారణ అయింది. కరీంనగర్‌ పట్టణంలోని మంకమ్మతోటలో ఇద్దరికి, మార్కండేయనగర్‌లో ముగ్గురికి, అశోక్‌నగర్‌లో ముగ్గురికి, మారుతీనగర్‌లో నలుగురికి, హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఇద్దరికి, లక్ష్మీనగర్‌లో నలుగురికి, బోయవాడలో ఇద్దరికి, రాఘవేంద్రనగర్‌లో ఇద్దరికి కొవిడ్‌ నిర్ధారణ అయింది. వావిలాలపల్లిలో నలుగురు, సుభాష్‌నగర్‌లో ముగ్గురు, శివాజీనగర్‌లో ముగ్గురు, ప్రశాంత్‌నగర్‌ కాలనీలో ఒకరు, విద్యానగర్‌లో ఒకరికి, జ్యోతినగర్‌లో ఐదుగురికి కరోనా వ్యాధి సోకింది. 

Updated Date - 2020-09-19T05:31:01+05:30 IST