Advertisement
Advertisement
Abn logo
Advertisement

సాధారణ జలుబు స్థాయికి Corona..

  • ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి

హైదరాబాద్‌ సిటీ : డెల్టా వేరియంట్‌ వ్యాప్తి తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ నష్టాన్ని కలిగించిందని, ఒమైక్రాన్‌ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా నష్టం తక్కువగా ఉందని ఏఐజీ ఆస్పత్రుల గ్రూప్‌ చైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని వివరించారు. ఆన్‌లైన్‌ వేదికగా శుక్రవారం ‘ఒమైక్రాన్‌ గురించి మరింత’ పేరుతో పలువురు వైద్యులు, నిపుణులతో చర్చ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. కొవిడ్‌కు ప్రస్తుతం డీజీసీఐ ఆమోదం పొందిన ఒకే ఔషధం ఉందని, మరిన్ని మందులు అందుబాటులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. 


ఒమైక్రాన్‌లో ఉన్న జన్యుమార్పుల కారణంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ వేయించుకున్న వారికి కూడా సోకుతుందన్నారు. రానున్న కాలంలో వైరస్‌ మరింత జన్యు పరివర్తనాలు చెంది బలహీనపడి సాధారణ జలుబు స్థాయికి చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏఐజీ పల్మనాలజీ విభాగాధిపతి డాక్టర్‌ విశ్వనాథ్‌ గెల్లా మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లలో కొవిడ్‌ చికిత్సల గురించి పూర్తిస్థాయిలో అవగాహన వచ్చిందన్నారు. డాక్టర్లు అనురాధా శేఖరన్‌, మిథున్‌ శర్మ, ప్రగతి, కేతన్‌, గౌతం, నవీన్‌ మాట్లాడారు. 

Advertisement
Advertisement