పక్కాగా లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-04-04T12:08:39+05:30 IST

సిక్కోలులో పక్కాగా లాక్‌డౌన్‌ అ మలవుతోంది. ప్రధానంగా ఉదయం వేళ నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడంతో పదకొండు గంటల వరకు రోడ్లపై రద్దీ ఉంటోంది.

పక్కాగా లాక్‌డౌన్‌

రోడ్లపైనే పోలీసుల మకాం

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 470 కేసులు

జిల్లా పరిస్థితిపై కేంద్ర మంత్రి ఆరా

ఎస్పీతో వీడియో కాన్ఫరెన్స్‌


శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి, ఏప్రిల్‌ 3 : సిక్కోలులో పక్కాగా లాక్‌డౌన్‌ అ మలవుతోంది. ప్రధానంగా ఉదయం వేళ నిత్యావసరాలకు ఇబ్బంది లేకుండా  ఏర్పాట్లు చేయడంతో పదకొండు గంటల వరకు రోడ్లపై రద్దీ ఉంటోంది. అన్ని స్థాయిల్లో పోలీసు అధికారులు రోడ్లపైనే మకాం వేస్తున్నారు. జనాలను కట్టడి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో  సైతం పదకొండు గంటలకే దుకాణాలను మూసివేయిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇప్పటివరకూ  470 కేసులు నమోదయ్యాయి.  1129 వాహనాలను సీజ్‌ చేశారు.


 సరిహద్దుల్లో గట్టి నిఘా.. 

 ఇటు జిల్లా సరిహద్దులు.. అటు రాష్ట్ర సరిహద్దుల్లో మరింత నిఘా అమలు చేస్తున్నారు.  ఇతరులెవరూ జిల్లాలో  ప్రవేశించకుండా చూస్తున్నారు. ఒడిశా నుం ్డచి  జిల్లాలో చొరబడకుండా  అంతరాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. ద్వి చక్రవాహనాలను సైతం నిలిపివేశారు. అలాగే.. విశాఖ, విజయనగరం జిల్లాల నుంచి వచ్చే జనాలను సైతం కట్టడి చేశారు.  క్వారంటైన్‌కు అంగీకరిస్తేనే వారి ని అనుమతి ఇస్తున్నారు.


నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు.. 

జనతా కర్ఫ్యూ తర్వాత కొన్ని విషయాల్లో మినహాయింపు ఉండేది. ఆ త ర్వాత నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తున్నారు. రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు అన్నిస్థాయిల ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తుండడంతో నిబంధనలు కఠినతరమయ్యాయి. మోటార్‌ వాహనాల చట్టం కింద 49 కేసులు నమోదయ్యాయి. అపరాద రుసుం కింద రూ. 26వేలు వసూలు చేశారు. 


సిక్కోలు పరిస్థితిపై ఆరా... 

సిక్కోలులో పరిస్థితిలపై కరోనా రాష్ట్ర ప్రత్యేక అధికారి,  కేంద్ర ఆర్థికశాఖ మం టత్రి నిర్మలా సీతారామన్‌ ఆరా తీశారు.  ఈమేరకు శుక్రవారం  ఆమె వీడి టయో కాన్ఫరెన్స్‌ ద్వారా  ఎస్పీ అమ్మిరెడ్డితో మాట్లాడారు. ఇప్పటివరకు లాక్‌ డౌన్‌ నేపథ్యంలో జిల్లాలో నెలకొన్న పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఒకే దఫా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తేరి ఒత్తిడి పెరిగి.. అన్ని వ్యవస్థలకు ఇబ్బంది ఏర్పడు తుందని ఈ సందర్భంగా ఎస్పీ  వివరించారు.  ఆంక్షలు నడుమ.. దశల వారీ గా లాక్‌డౌన్‌ ఎత్తివేస్తే  బాగుంటుందని అన్నారు.  శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా.. పక్కాగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని ఎస్పీ  చెప్పారు. 


 కరోనా ఆస్పత్రులు సిద్ధం

రాష్ట్ర ఆర్‌అండ్‌బీ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, జిల్లా కరోనా ప్రత్యేకాధికారి ఎంఎం నాయక్‌  జిల్లాలో కరోనా ఆస్పత్రిలను శుక్రవారం పరిశీలించారు.  అక్క డ వైద్యులతో వారు మాట్లాడారు. 

Updated Date - 2020-04-04T12:08:39+05:30 IST