హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన మహిళకు అనారోగ్యం.. అనుమానంతో కరోనా టెస్ట్ చేస్తే..

ABN , First Publish Date - 2020-07-13T20:08:05+05:30 IST

నిజామాబాద్ జిల్లాలో కరోనా పా జిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి కే జిల్లాలో 240కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కా గా ఆదివారం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

హైదరాబాద్‌కు వెళ్లొచ్చిన మహిళకు అనారోగ్యం.. అనుమానంతో కరోనా టెస్ట్ చేస్తే..

నిజామాబాద్ జిల్లాలో కొత్తగా మరో 10 కరోనా కేసులు 


నిజామాబాద్‌ అర్బన్ (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ జిల్లాలో కరోనా పా జిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇప్పటి కే జిల్లాలో 240కి పైగా పాజిటివ్‌ కేసులు నమోదు కా గా ఆదివారం నగరంతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో 10 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 250కి చేరింది. కరోనాతో మొత్తం తొమ్మిది మంది మృతిచెందారు. మరో 14 శాంపిళ్ల రిపోర్టులు రావాల్సి ఉందని వైద్య శాఖ అధి కారులు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు పాజిటివ్‌ కే సులు జిల్లాలో తగ్గుముఖం పట్టినప్పటికీ లాక్‌డౌన్‌ సడలింపులతో పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పాజిటివ్‌ కేసులతో పాటు మృతిచెందుతున్న సంఘటనలు జిల్లాలో నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇదివరకు జిల్లాలో కరోనా అనుమానితులకు రక్తపరీక్షలు నిర్వహించి హైదరాబాద్‌కు పంపేవారు. 


ప్రస్తుతం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోనే పరీక్షలు నిర్వహిస్తుండడంతో పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రతీరోజు 30 మందికి పరీక్షలు నిర్వహిస్తుంటే దాదాపు 15 మందికి పాజిటివ్‌ వస్తుండడంతో జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వ్యాధి ఉధృతంగా ఉన్న మొదటి దశలో జిల్లాలో 60కి పైగా కే సులు  నమోదు కాగా లాక్‌డౌన్‌ కాలంలో కరోనా పాజిటివ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ లాక్‌డౌన్‌ సడ లింపులతో మరోసారి జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బోధన్‌, ఆర్మూర్‌, భీ మ్‌గల్‌ ప్రాంతాల్లో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నా యి. నిజామాబాద్‌ నగరంలోనూ కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకూ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇ ప్పటికే నిజామాబాద్‌లో పాజిటివ్‌ కేసులు 140కి పైగా నమోదయ్యాయి. కరోనా నియంత్రణకు కృషిచేస్తున్న వై ద్యులకు కూడా కరోనా పాజిటివ్‌ రావడం గమనార్హం. పోలీసు శాఖలోని కరోనా పాజటివ్‌ కేసులు కలకలం సృ ష్టిస్తున్నాయి. ఆదివారం సైతం నగరంతో పాటు  జిల్లాలోని పలు ప్రాంతాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


డొంకేశ్వర్‌లో మహిళకు కరోనా పాజిటివ్‌

నందిపేట మండలంలోని డొంకేశ్వర్‌ గ్రామానికి చెందిన మహిళ(42)కు కరోనా సోకింది. ఇటీవల హైదరాబాద్‌ వెళ్లివచ్చిన ఆమె తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. వైద్యపరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా బాధితురాలి కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 14రోజుల పాటు హోంక్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన కాలనీలో స్థానిక సర్పంచ్‌, నాయకుల ఆద్వర్యంలో శానిటైజేషన్‌ చేశారు. ఇళ్లల్లో నుంచి గ్రామస్థులు ఎవరూ బయటకు రావద్దని, ప్రతీ షాప్‌ మూసి ఉంచాలని హెచ్చరికలు జారీ చేశారు.


బోధన్‌లో ఎస్సైకి..

బోధన్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తు న్న ఓ ఎస్సైకి ఆదివారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. బో ధన్‌ పట్టణ సీఐ పరిధిలోని స్టేషన్‌లో ముగ్గురు ఎస్సైలు విధులు నిర్వహిస్తుండగా అందులో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. సదరు ఎస్సై గత నాలుగైదు రోజులుగా జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ అనారోగ్యానికి గురికావడంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆదివారం అతనికి పాజిటివ్‌ వచ్చింది. ఎస్సైకి కరోనా పాజిటివ్‌ రావడంతో స్టేషన్‌లో పనిచేసే సిబ్బందితో పాటు ఆయనతో కలిసి తిరిగిన వారు ఆందోళనకు గురవుతున్నారు. 


లయన్స్‌ క్లబ్‌ కంటి వైద్యుడికి..

బోధన్‌ లయన్స్‌ క్లబ్‌లో పనిచేస్తున్న కంటి వైద్యుడికి ఆదివారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. నిజామాబాద్‌కు చెందిన ఆ వైద్యుడు బోధన్‌ లయన్స్‌ క్లబ్‌ ఆసుపత్రిలో సర్జన్‌గా పనిచేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఆయ న లయన్స్‌ క్లబ్‌ కంటి ఆసుపత్రిలో సుమారు పది మం దికి ఆపరేషన్‌లు చేశారు. రెండు రోజులుగా ఆయన అ స్వస్థతకు గురి కావడంతో కరోనా పరీక్షలు నిర్వహించు కున్నాడు. ఆదివారం పాజిటివ్‌ వచ్చింది. ప్రస్తుతం ఆ యన జిల్లా కేంద్రంలో హోంక్వారంటైన్‌లో ఉన్నారు. క్లబ్‌ వైద్యుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఆసపత్రిలోని సి బ్బంది, రోగులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2020-07-13T20:08:05+05:30 IST