అలాంటి వారికే ఎక్కువగా కరోనా సోకే అవకాశం

ABN , First Publish Date - 2021-04-02T02:17:46+05:30 IST

అలాంటి వారికే ఎక్కువగా కరోనా సోకే అవకాశం

అలాంటి వారికే ఎక్కువగా కరోనా సోకే అవకాశం

హైదరాబాద్: కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా ఎంతో మంది కరోనా బారిన పడ్డారు. ఇప్పుడు సెకండ్ వేవ్ కూడా ప్రజల్ని ఇబ్బంది పెడుతోంది. చిన్న, పెద్ద, ఆడ, మగ అనే సంబంధం లేకుండా అందర్నీ అన్ని వయసుల వారిని ప్రభావితం చేస్తోంది.


ముఖ్యంగా వృద్ధులు, ఊబకాయం కలిగిన వారు, రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారిపై కోవిడ్ ప్రభావం అధికంగా ఉంది. ఫలితంగా మూత్త్ర పిండాలు, గుండె జబ్బులు బారిన పడే అవకాశం ఉంది. తాజాగా ఓ అధ్యయనం మరో ప్రమాదం గురించి వెల్లడించింది. ప్రత్యేకించి మహిళలపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందని తేల్చింది. ఈ అధ్యయనం ప్రకారం పీసీవోఎస్‌తో బాధపడుతున్న మహిళల్లో కరోనా వచ్చే అవకాశం 50 శాతం ఎక్కువట. 


Updated Date - 2021-04-02T02:17:46+05:30 IST