త్వ‌ర‌లో ఇంటి స‌హాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు

ABN , First Publish Date - 2020-07-09T13:32:20+05:30 IST

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఈ నేప‌ధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ రెస్పాన్స్ స్కీమ్ కింద రోజువారీ కూలీలు, గృహ సహాయకులు...

త్వ‌ర‌లో ఇంటి స‌హాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీల‌కు క‌రోనా ప‌రీక్ష‌లు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి ద‌య‌నీయంగా మారింది. ఈ నేప‌ధ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కోవిడ్ రెస్పాన్స్ స్కీమ్ కింద రోజువారీ కూలీలు, గృహ సహాయకులు, ఆటో డ్రైవర్లు, కూరగాయల విక్రేత‌ల‌కు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించింది. ఇందుకోసం నిషేధిత ప్రాంతాలు, బఫర్ జోన్లు, ఇతర ప్రాంతాలలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నట్లు ఆరోగ్య సేవల డైరెక్టరేట్ జనరల్ ఒక ఉత్తర్వులో తెలిపారు. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల ప్ర‌కారం రిక్షా డ్రైవర్లు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్లు, వడ్రంగి, ఆటో, టాక్సీ డ్రైవర్లు, పార్శిల్ పంపిణీదారులు మొద‌లైన వారి జాబితాను మున్సిపల్ కార్పొరేషన్, ఆర్‌డబ్ల్యుఎ, పోలీసు, ఇతర విభాగాల సహాయంతో తయారు చేయ‌నున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాలలో 60 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు, అధిక రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్ త‌దిత‌ర‌ వ్యాధులతో బాధపడుతున్న వారి జాబితాను కూడా సిద్ధం చేయ‌నున్నారు. కాగా గత 24 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీలో కొత్త‌గా 2033 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ తెలిపింది. 

Updated Date - 2020-07-09T13:32:20+05:30 IST