Abn logo
Jul 8 2020 @ 04:41AM

అనుమానితులందరికీ కరోనా పరీక్షలు

మంత్రి శంకర నారాయణ

కొవిడ్‌-19 ఐమాస్క్‌ మొబైల్‌ వాహనాలు ప్రారంభం


అనంతపురం వైద్యం, జూలై 7: కరోనా అనుమానితులందరికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకరనారాయణ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక శ్రీనగర్‌కాలనీలో కరోనా న మూనాల సేకరణకు జిల్లాకు కొత్తగా వచ్చిన ఐమాస్క్‌ మొబైల్‌ వాహనాలను మంత్రి ప్రారంభించి మాట్లాడారు. కరోనా నియంత్రణకు అధిక సంఖ్యలో పరీక్షలు చేయడం వల్లనే సాధ్యమవుతుందన్నారు. ఈనేపథ్యం లో ప్రభుత్వం నమూనాల సేకరణకు అధునాతన టెక్నాలజీతో కూడిన తొమ్మిది కొవిడ్‌-19 ఐమాస్క్‌ మొబైల్‌ వాహనాలను జిల్లాకు పంపిందన్నారు.


వాహనాలు కరోనా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ అనుమానితులందరి నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తారన్నారు. జిల్లాలో కేసులు అమాంతంగా పెరుగుతున్నాయని, ప్రజలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్‌ గంధం చంద్రుడు మాట్లాడుతూ హైరిస్క్‌, 60 ఏళ్లుపైబడిన దీర్ఘకాలిక రోగులు, శ్వాసకోశ వ్యా ధుల బాధిలందరికీ కరోనా పరీక్షల్లో ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ స్వీయ నియంత్రణ వల్లనే కరోనా కట్టడి సాధ్యమన్నారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని కోరారు. కార్యక్రమంలో జేసీ డాక్టర్‌ సిరి, ట్రైనీ కలెక్టర్‌ సూర్య, ఆర్డీఓ గుణభూషణ్‌రెడ్డి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అనిల్‌కుమార్‌, నగరపాలక సంస్థ కమిషనర్‌ పీవీవీఎస్‌ మూర్తి పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement