‘గ్రే మేటర్‌కు’ పొంచివున్న కరోనా ప్రమాదం!

ABN , First Publish Date - 2021-06-11T08:43:20+05:30 IST

‘గ్రే మేటర్‌’.. మెదడులోని అత్యంత కీలకమైన కణజాలం ఇది. శరీర భాగాలకు సందేశాలను పంపుతూ.. వాటి కదలికలు, పనితీరును ని యంత్రించడంలోనూ, జ్ఞాపక శక్తిని పెంపొందించడం...

‘గ్రే మేటర్‌కు’ పొంచివున్న కరోనా ప్రమాదం!

  • జార్జియా స్టేట్‌ వర్సిటీ అధ్యయనంలో వెల్లడి

న్యూఢిల్లీ, జూన్‌ 10: ‘గ్రే మేటర్‌’.. మెదడులోని అత్యంత కీలకమైన కణజాలం ఇది. శరీర భాగాలకు సందేశాలను పంపుతూ.. వాటి కదలికలు, పనితీరును ని యంత్రించడంలోనూ, జ్ఞాపక శక్తిని పెంపొందించడం, భావోద్వేగాలను కలిగించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. ఇప్పుడు కరోనా వల్ల ఈ గ్రే మేటర్‌కు ప్రమాదం పొంచి ఉందంటున్నారు శాస్త్రవేత్తలు. ఆక్సిజన్‌, వెంటిలేటర్ల సపోర్ట్‌తో చికిత్స తీసుకున్న కరోనా రోగులు కొందరిలోఈ గ్రే మేటర్‌కు సంబంధించిన సమస్యలు తలెత్తుతున్నాయని ఓ అధ్యయ నం వెల్లడించింది. మెదడులోని గ్రే మేటర్‌పై కరోనా తీవ్రమైన ప్రభావం చూపుతోందని, ఇందువల్ల ఆ కణజాలం కుంచించుకుపోతోందని తెలిపింది. జార్జియా స్టేట్‌ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ అధ్యయనం.. న్యూరో బయాలజీ ఆఫ్‌ స్ట్రెస్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. 


Updated Date - 2021-06-11T08:43:20+05:30 IST