తహసీల్దార్‌కు,డీటీకి కరోనా

ABN , First Publish Date - 2021-10-27T07:24:49+05:30 IST

తహసీల్దార్‌తో పాటు, డిప్యూటీ తహసీల్దార్‌కూ కరోనా సోకింది.

తహసీల్దార్‌కు,డీటీకి కరోనా

పీలేరులో స్తంభించిన రెవెన్యూ సేవలు


పీలేరు,అక్టోబరు 26: రెండురోజులుగా పీలేరులో తహసీల్దార్‌ కార్యాలయం మూత పడడంతో రెవెన్యూసేవలు పూర్తిగా స్తంభించి పోయాయి. తహసీల్దార్‌తో పాటు, డిప్యూటీ తహసీల్దార్‌కూ  కరోనా సోకిన కారణంగా రెండు రోజులు సెలవు ప్రకటించడంతో కార్యాలయం మూతపడింది.ఇటీవల కరోనా కేసులు నామమాత్రంగానే నమోదవుతుండడంతో  ప్రజలు  మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించక పోవడం పూర్తిగా విస్మరించారు. ఈ పరిస్థితుల్లో మండలస్థాయి అధికారులు కరోనా బారిన పడడంతో స్థానికుల్లో అలజడి మొదలైంది. ఇప్పటికే కార్యాలయ ఆవరణంలో పారిశుధ్య కార్యక్రమాలు ముమ్మరం చేశారు.మిగిలిన సిబ్బంది అందరూ కోవిడ్‌ పరీక్షలు చేసుకునే పనిలో వున్నారు. మంగళవారం కార్యాలయం తెరుచుకోనున్నా సిబ్బంది అందరూ విధులకు హాజరయ్యే పరిస్థితి కన్పించడంలేదు.


కొవిడ్‌ తాజా కేసులు 93 

తిరుపతి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి మంగళవారం ఉదయం 9 గంటల వరకు 24 గంటల వ్యవధిలో 93మందికి కరోనా సోకింది. తాజా కేసులతో జిల్లాలో పాజిటివ్‌ల సంఖ్య 246552కు చేరుకుంది.యాక్టివ్‌ కేసులు 895 ఉన్నాయి. 


కరోనా మృతుల కుటుంబాలకు రూ.50వేలు 

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 26: కరోనాతో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.50వేల పరిహారం అందజేయనున్నట్లు డీఆర్వో మురళి తెలిపారు. ఇందుకోసం బాధిత కుటుంబీకుల నుంచి దరఖాస్తులు కలెక్టరేట్‌లో స్వీకరిస్తామన్నారు.గురువారం ఈఅంశంపై కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పా టు చేశామని చెప్పారు. ఇందులో జేసీ శ్రీధర్‌, డీఎంహెచ్‌వో శ్రీహరి, డీసీహెచ్‌ఎ్‌స సరళమ్మ, మున్సిపల్‌ కమిషనర్లు పాల్గొంటారని పేర్కొన్నారు.

Updated Date - 2021-10-27T07:24:49+05:30 IST