900 మందికి కరోనా వ్యాక్సిన

ABN , First Publish Date - 2021-01-18T05:31:27+05:30 IST

జిల్లాలో కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు రెండోరోజైన ఆదివారం 900 మందికి కరోనా వ్యాక్సిన వేసినట్లు డీఎంహెచవో అనిల్‌కుమార్‌ తెలిపారు. తొలిరోజు 2001 మందికి వ్యాక్సిన వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా సాఫ్ట్‌వేర్‌ సమస్య, అనారోగ్య కారణాలతో కొందరు వ్యాక్సిన వేసుకునేందుకు ముందుకు రానట్లు తెలిసింది.

900 మందికి కరోనా వ్యాక్సిన
కడప రిమ్స్‌లో వ్యాక్సిన వేసుకుంటున్న డాక్టర్‌ నగేష్‌

కడప, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా ఫ్రంట్‌ వారియర్స్‌కు రెండోరోజైన ఆదివారం 900 మందికి కరోనా వ్యాక్సిన వేసినట్లు డీఎంహెచవో అనిల్‌కుమార్‌ తెలిపారు. తొలిరోజు 2001 మందికి వ్యాక్సిన వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా సాఫ్ట్‌వేర్‌ సమస్య, అనారోగ్య కారణాలతో కొందరు వ్యాక్సిన వేసుకునేందుకు ముందుకు రానట్లు తెలిసింది. నియోజకవర్గానికి రెండు చొప్పున 20 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కేంద్రాల వారీగా రెండోరోజు ఆదివారం పరిశీలిస్తే... కడప రిమ్స్‌ ఆస్పత్రిలో 23, అక్కాయపల్లె పీహెచసీలో 39, చెన్నూరు 40, పెండ్లిమర్రి 58, దువ్వూరులో 65, మైదుకూరు 60, కల్లూరు 43, ప్రొద్దుటూరు 48, జమ్మలమడుగు 62, ముద్దనూరు 22, పులివెందుల 28, తాళ్లపల్లె 36, రాయచోటి 82, దేవపట్ల 64, పుల్లంపేట 31, రైల్వేకోడూరు 31, రాజంపేట 29, నందలూరు 22, బద్వేలు 60, పోరుమామిళ్లలో 57 మందికి వ్యాక్సిన వేశారు. మొత్తం 900 మంది వ్యాక్సిన వేసుగా ఆదివారం నాటికి 2024 మందికి వ్యాక్సిన వేశారు. 

Updated Date - 2021-01-18T05:31:27+05:30 IST