మరో ఇద్దరికి కరోనా

ABN , First Publish Date - 2020-04-09T11:11:45+05:30 IST

జిల్లాలో మ రో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ రెండు కే సులు కూడా బాన్సువాడ పట్టణంలోనే నమోదయ్యాయి. ఢీల్లీ వెళ్లి వచ్చి కరోనా సోకిన వారితో సం బంధం

మరో ఇద్దరికి కరోనా

జిల్లాలో 10కి చేరిన కరోనా బాధితులు

బాన్సువాడ పట్టణంలో హై అలర్ట్‌

 

కామారెడ్డి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మ రో ఇద్దరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఈ రెండు కే సులు కూడా బాన్సువాడ పట్టణంలోనే నమోదయ్యాయి. ఢీల్లీ వెళ్లి వచ్చి కరోనా సోకిన వారితో సంబంధం ఉండటంతో కరోనా వైరస్‌ వచ్చినట్లు అధికా రులు చెబుతున్నారు. దీంతో కామారెడ్డి జిల్లాలో కరో నా బాధితుల సంఖ్య పదికి చేరింది. బాన్సువాడలోనే తొమ్మిది కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం తో పట్టణమంతా హైఅలర్ట్‌ నిర్వహించారు. ఇప్పటికే పట్టణంలోని మూడు కంటోన్మెంట్‌ జోన్‌ లుగా ప్రకటించారు. 25మంది అనుమానిత లక్షణా లు గల బాధితుల రక్త నమునాలను ల్యాబ్‌కు పంపగా.. బుధవారం ప్రభుత్వం 23 మందికి కరోనా నెగిటివ్‌ వచ్చినట్లు ప్రకటించింది. మరో ఇద్దరికి మాత్రం పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యా ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.


ఢీల్లిలోని నిజామోద్దీన్‌ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఐదుగురిని అధికా రులు గుర్తించి గాంధీ ఆసుపత్రికి తరలించారు. వారిలో బాన్సువాడ పట్టణానికి చెందిన ఇద్దరికి కరోనా పాజిటివ్‌ రావడం, వారితో మెలిగిన మరో ఐదుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇలా కరోనా సోకిన ఏడుగురితో సన్నిహిత సంబంధాలు ఉన్న మరో ఇద్దరికి కూడా కరోనా సోకడంపై బాన్సువాడ పట్టణ ప్రజలను మరింత ఆందోళనకు గురి చేస్తోం ది. మరో 15 మంది రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు చెబుతన్నారు. ఈ ఇద్దరు ఎవరెవరితో సన్నిహితంగా ఉన్నారో? ఎక్క డెక్కడికి వెళ్లారో? అనే వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. వారిని సైతం గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు.


బాన్సువాడలోనే తొమ్మిది కేసులు..

జిల్లాలో ఇప్పటి వరకు పది కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో తొమ్మిది కేసులు బాన్సు వాడ పట్టణంలోనే నమోదైయ్యాయి. పట్టణంలోని అర్పత్‌ కాలనీ, మదీనా కాలనీ, టీచర్స్‌ కాలనీలోనే నమోదయ్యాయి. తాజాగా వచ్చిన రెండు పాజిటివ్‌ కేసులు కూడా ఈ కాలనీలకు చెందినవారివే! దీంతో ఈ కాలనీలను కటోన్మెంట్‌ జోన్‌లుగా జిల్లా అధికా రులు ప్రకటించారు. ఈ కాలనీల వాసులకు బయ ట వ్యక్తులతో ఎలాంటి సత్సంబంధాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఈ కాలనీలను పూర్తిగా దిగ్భందం చేశారు.


కాలనీలోకి బయట వ్యక్తులను ఎవరు వెళ్లనివ్వకుండా.. కాలనీల్లోంచి బయటకు ఎవరూ రాకుండా ఆయా ప్రధాన రహదారుల వద్ద భారీకెడ్లను ఏర్పాటు చేశారు. కాలనీవాసులకు కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. అత్యవసర సరుకుల కోసం అధికారులు డోర్‌ డెలివరి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.  ఈ మూడు కాలనీల్లోనే కాకుండా బాన్సువాడ పట్టణం మొత్తం లాక్‌డౌన్‌ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. కరోనా వైరస్‌ బారిన పడిన వారిపై, కుటుంబ సభ్యులపై, బంధువులపై, అనుమానిత లక్షణాలు ఉన్న వారిపై, కారంటైన్‌లో చికిత్స పొందుతున్న వారిపై పోలీసులు, రెవెన్యూ, వైద్యాఆర్యోగశాఖ అధికారులు పకడ్బందీ నిఘాను ఏర్పాటు చేశారు. వీరంతా 14 రోజులపాటు కారంటైన్‌లోనే ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

Updated Date - 2020-04-09T11:11:45+05:30 IST