Abn logo
Apr 4 2020 @ 06:45AM

మత పెద్దలతో సీఎస్‌ సమావేశం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా బాధితులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యల్లో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.షణ్ముగం శుక్రవారం రాష్ట్రంలో నివసిస్తున్న అన్ని మతాల పెద్దలతో సమావేశమయ్యారు. ఢిల్లీ నిజముద్దీన్‌ ఉదంతం అనంతరం మతపరమైన వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ సమావేశం జరిగినట్లు తెలుస్తోంది. చెన్నైలోని సచి వాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగిన ఈ సమావేశంలో వివిధ మతాలకు చెందిన నేతలు పాల్గొన్నారు. కరోనాను అడ్డుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, అవనసర వివాదాలకు తావు లేకుండా అందరం కలిసి కరోనాని ఎదుర్కొందామని ఆ సందర్భంగా ప్రభుత్వం మత పెద్దలకు పిలుపునిచ్చినట్లు సమాచారం.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement