క‌రోనాపై పోరాటంలో 400 మంది సైనిక రిటైర్డ్ డాక్ట‌ర్లు!

ABN , First Publish Date - 2021-05-10T16:42:57+05:30 IST

కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలోని...

క‌రోనాపై పోరాటంలో 400 మంది సైనిక రిటైర్డ్ డాక్ట‌ర్లు!

న్యూఢిల్లీ: కరోనా వైరస్ సెకెండ్ వేవ్ దేశంలోని ఆరోగ్య వ్యవస్థను సవాల్ చేస్తోంది. దేశంలోని ఆసుపత్రుల్లో తగినంత మంది ఆరోగ్య కార్యకర్తలు లేరు .  ప్రస్తుతం విధులు నిర్వ‌హిస్తున్న‌ ఆరోగ్య కార్యకర్తలు సామర్థ్యానికి మించి విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ నేప‌ధ్యంలో కోవిడ్-19తో పోరాడేందుకు సాయుధ దళాల మెడికల్ సర్వీస్ (ఏఎఫ్ ఎంఎస్) రిటైర్డ్ వైద్యులను 11 నెలల పాటు నియమించాలని రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. కోవిడ్-19 మహమ్మారిపై పోరాటాన్ని బలోపేతం చేయడానికి సాయుధ దళాల మెడికల్ సర్వీస్ (ఏఎఫ్‌ఎంఎస్) 400 మంది రిటైర్డ్ వైద్యులను 11 నెలల పాటు నియమించడానికి సిద్ధంగా ఉందని అధికారులు తెలిపారు. 2017- 2019 మధ్య సర్వీస్ నుంచి రిటైర్ అయిన వైద్యులను నియమించడానికి ఎఎఫ్‌ఎమ్ ఎస్‌కు అనుమతిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్-19పై జ‌రుగుతున్న‌ యుద్ధంలో సాయుధ దళాలు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విభాగాలు చురుకుగా పాల్గొంటున్నాయి. కోవిడ్-19 బాధితుల‌కు వైద్య సేవ‌లు అందించేందుకు వారు కోవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేశారు, 



Updated Date - 2021-05-10T16:42:57+05:30 IST