జర్మనీవాసులను తరలించేందుకు 9 ఎయిర్ ఇండియా విమానాలు

ABN , First Publish Date - 2020-03-28T16:02:38+05:30 IST

దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో చిక్కుకున్న జర్మనీ ప్రవాసులను ఫ్రాంక్‌ఫర్ట్‌కు తరలించేందుకు ఎయిర్ ఇండియా వచ్చే వారం 9 ప్రత్యేక విమాన సర్వీసులను నడపాలని ...

జర్మనీవాసులను తరలించేందుకు 9 ఎయిర్ ఇండియా విమానాలు

ముంబై : దేశంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో దేశ ఆర్థిక రాజధాని నగరమైన ముంబైలో చిక్కుకున్న జర్మనీ ప్రవాసులను ఫ్రాంక్‌ఫర్ట్‌కు తరలించేందుకు ఎయిర్ ఇండియా వచ్చే వారం 9 ప్రత్యేక విమాన సర్వీసులను నడపాలని నిర్ణయించింది. ముంబైలో చిక్కుకున్న వందలాది మంది జర్మనీ వాసులను మార్చి 31 నుంచి ఏప్రిల్ 3వతేదీల మధ్య నడిపే ప్రత్యేక విమానాల్లో ఫ్రాంక్‌ఫర్ట్‌ నగరానికి తరలించనున్నారు. మార్చి 31 వతేదీన ఐదు విమానాలు, ఏప్రిల్ 2వతేదీన రెండు విమాన సర్వీసులను ముంబై- ఫ్రాంక్‌ఫర్ట్ కు నడపాలని ఎయిర్ ఇండియా నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి 3వతేదీ వరకు మరో మూడు విమానాలు నడుపుతారు. కరోనా వైరస్ ప్రబలుతుండటంతోపాటు 21 రోజులపాటు లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ముంబైలోని జర్మనీవాసులను వారి దేశానికి తరలించాలని నిర్ణయించారు.

Updated Date - 2020-03-28T16:02:38+05:30 IST