గ్రామాల్లో ‌పెరుగుతున్న క‌రోనా ముప్పు!

ABN , First Publish Date - 2020-05-23T16:30:35+05:30 IST

బీహార్‌లోని ప‌ట్నాజిల్లాలో క‌రోనా వ్యాప్తి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో త‌గ్గుముఖంపట్టి, గ్రామీణ ప్రాంతాల‌లో విజృంభిస్తోంది. ప్ర‌స్తుత మే నెల‌లో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో క‌రోనా వ్యాప్తి అధికంగా...

గ్రామాల్లో ‌పెరుగుతున్న క‌రోనా ముప్పు!

ప‌ట్నా: బీహార్‌లోని ప‌ట్నాజిల్లాలో క‌రోనా వ్యాప్తి ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో త‌గ్గుముఖంపట్టి, గ్రామీణ ప్రాంతాల‌లో విజృంభిస్తోంది. ప్ర‌స్తుత మే నెల‌లో పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లో క‌రోనా వ్యాప్తి అధికంగా ఉంది. ఈ వ్యాధి గత 10 రోజుల్లో మ‌రింత‌గా వ్యాప్తి చెందింది. దీనికి ప్రధాన కారణం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక‌ల నుంచి ఎక్కువ మంది కార్మికులు గ్రామాల‌కు వ‌చ్చారు. వివిధ ప్రాంతాల నుంచి బీహార్‌కు వ‌చ్చిన‌ 1010 మంది వలస కూలీల‌కు వైద్య‌ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, 61 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. దేశంలోని వివిధ రాష్ట్రాల నుండి ఇప్పటివరకు 14 వేల‌ మంది వ‌ల‌స కార్మికులు పట్నాకు చేరుకున్నారు. వీరిని 163 క్వారంటైన్‌ కేంద్రాల్లో ఉంచారు. వీరిలో 1822 మంది వలస కూలీలు 21 రోజుల క్వారంటైన్ కాలాన్ని పూర్తిచేసుకుని వారివారి గ్రామాల‌కు చేరుకుంటున్నారు. 

Updated Date - 2020-05-23T16:30:35+05:30 IST