కరోనా రోగుల చికిత్సకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు

ABN , First Publish Date - 2020-04-08T17:00:55+05:30 IST

దేశంలో కరోనా వైరస్ సోకిన రోగులను వారి వ్యాధి తీవ్రతను బట్టి మూడు రకాల ఆసుపత్రుల్లో చికిత్స చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది.....

కరోనా రోగుల చికిత్సకు కేంద్ర ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు

మూడు రకాల ఆసుపత్రులు

న్యూఢిల్లీ : దేశంలో కరోనా వైరస్ సోకిన రోగులను వారి వ్యాధి తీవ్రతను బట్టి మూడు రకాల ఆసుపత్రుల్లో చికిత్స చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. కరోనా అనుమానితులను కొవిడ్ కేర్ సెంటర్లలో,  కరోనా తీవ్రత మధ్యస్థంగా ఉన్న వారిని కొవిడ్ హెల్త్ సెంటర్లలో, కొవిడ్ తీవ్రవత ఎక్కువగా ఉన్న రోగులను కొవిడ్ ప్రత్యేక ఆసుపత్రుల్లో వైద్యచికిత్సలు చేయాలని ఆరోగ్యశాఖ అధికారులు నిర్ణయించారు. కరోనా వైరస్ తీవ్రతను బట్టి రోగులను మూడు రకాలుగా విభజించి ఆయా ఆసుపత్రుల్లో చికిత్స అందించాలని కేంద్రం ఆదేశించింది.


కేంద్రప్రభుత్వ, రాష్ట్రప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా రోగుల చికిత్సకు మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసింది. కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగులను ప్రత్యేకంగా ఐసీయూ, వెంటిలేటర్లు ఉన్న ఆసుపత్రుల్లో చేర్చాలని కేంద్ర ఆరోగ్యశాఖ కోరింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం కొవిడ్ కేర్ సెంటర్లు, కొవిడ్ హెల్త్ సెంటర్లు, కొవిడ్ ఆసుపత్రులను ఏర్పాటు చేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది. కరోనా కేసుల్లో 70 శాతం ప్రాథమిక దశలోనే ఉన్నందున వారిని కొవిడ్ కేర్ సెంటర్లు, కొవిడ్ హెల్త్ సెంటర్లలోనే చికిత్స చేయవచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు చెపుతున్నారు. 



Updated Date - 2020-04-08T17:00:55+05:30 IST