నకిలీ మద్యం రాకెట్‌ గుట్టు రట్టు

ABN , First Publish Date - 2020-04-02T10:40:56+05:30 IST

కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో బెంగళూరును కేంద్రంగా ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న 8 మందిని హిందూపురం ఎక్సైజ్‌ పోలీసులు అ దుపులోకి తీసుకున్నారు.

నకిలీ మద్యం రాకెట్‌ గుట్టు రట్టు

బెంగళూరు కేంద్రంగా తయారీ... 8 మంది అరె్‌స్ట... నకిలీ లేబుల్‌ బ్రాండ్‌తో విక్రయాలు... వివరాలు వెల్లడించిన

 ఎక్సైజ్‌ డిప్యూటీ కమిషనర్‌


హిందూపురం టౌన్‌, ఏప్రిల్‌ 1 : కరోనాను అరికట్టేందుకు లాక్‌డౌన్‌ అమలులో ఉండటంతో బెంగళూరును కేంద్రంగా ఏర్పాటు చేసుకుని నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్న 8 మందిని హిందూపురం ఎక్సైజ్‌ పోలీసులు అ దుపులోకి తీసుకున్నారు. బుధవారం స్థానిక ఎక్సైజ్‌ పోలీ్‌సస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ విజయశేఖర్‌  వివరాలు  వెల్లడించారు. లాక్‌డౌన్‌ సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో మద్యం బంద్‌ చేశారు. ఈ నేపథ్యంలో బెంగళూరు కేంద్రంగా నకిలీ లేబుల్‌, నకిలీ బ్రాండ్‌తో ప్రీమియరి డాక్టర్‌ బ్రాంది 180 ఎంఎల్‌ బాటిళ్లు తయారు చేసి హిందూపురం ప్రాంతంలో విక్రయిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి బొలెరో వాహనంలో తరలిస్తుండగా హిందూపురం మండలం మణేసముద్రం వద్ద ఎక్సైజ్‌ సీఐ నరసింహులు, ఎస్‌ఐలు సరోజాదేవి, రిహానాబేగం, ఓంసింహ, జిలాన్‌బాషా నిర్వహించిన వాహనాల తనిఖీల్లో పట్టుబడ్డాయన్నారు.


నిందితులు సో మందేపల్లి మండలం ఈదులబళాపురానికి చెందిన గుణశేఖర్‌, రొద్దం మండ లం చోళసముద్రంకు చెందిన  హరీఫ్‌, ఓబుళరెడ్డిని విచారించగా బెంగళూరు నుంచి నకిలీ మద్యం తెచ్చి సరఫరా చేస్తున్నట్లు తెలిపారన్నారు. మణేసము ద్రం వద్ద శ్రీనివాసులు హిందూపురానికి చెందిన గంగాధర్‌నాయక్‌, ఆది, ఈ శ్వర్‌ వద్ద ఉన్న నకిలీ మద్యంను కూడా స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసినట్లు తెలిపారు. వీరి  నుంచి 17 మద్యం బాక్సులు స్వాధీనం చేసుకోగా 853 బా టిళ్లు అందు లో ఉన్నాయన్నారు. శ్రీకంఠపురానికి చెందిన హరి అనే వ్యక్తి పరారీలో ఉన్నాడన్నారు.  

 

విచ్చలవిడిగా మద్యం విక్రయాలు

కీలక పాత్ర పోషిస్తున్న అధికార పార్టీ నాయకులు


ధర్మవరం, ఏప్రిల్‌ 1 : కరోనా కట్టడి కోసం కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంటే వాటినే అధికార పార్టీ నాయకులు తమ వ్యాపారంగా మార్చుకున్నారు. పట్టణంలో అధికార పార్టీకి చెందిన కొందరు నాయకు లు అక్రమ మద్యం విక్రయాలు సాగిస్తున్నారు. ఈ తతంగాన్ని పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడతో వారి వ్యాపారం మూడు పూవులు ఆరు కాయలుగా సాగుతోంది. అధికార పార్టీ నాయకులు కొందరు స్థానిక ఎన్నికల్లో పంపిణీకి ముందస్తుగా మద్యాన్ని డంపింగ్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. కరోనా కర్ఫ్యూ కారణంగా మద్యం దుకాణాలు బంద్‌ అయ్యాయి. దీంతో అప్పట్లో డంప్‌ చేసిన మద్యాన్ని ఇప్పుడు అక్రమంగా అధిక ధరలకు విక్రయించి సొ మ్ము చేసుకుంటున్నారు. ప్రస్తుతం రూ.200 ధర ఉన్న బాటిల్‌ను రూ.1000లకు, రూ.1000 ఉన్న బాటిల్‌ను రూ.3,500 వరకు దర్జాగా అమ్ముకుని బాగానే ఆర్జిస్తున్నారు. 

Updated Date - 2020-04-02T10:40:56+05:30 IST