శ్రామిక్ రైల్లో వెళ్తుండగా కొడుకు పుట్టాడు.. పేరేమి పెట్టారో తెలిస్తే..!

ABN , First Publish Date - 2020-05-24T04:39:25+05:30 IST

కరోనా కల్లోలం మధ్య ఓ శ్రామిక్ ‌రైల్లో స్వస్థలానికి వెళ్తున్న దంపతులకు కుమారుడు జన్మించడంతో వారు..

శ్రామిక్ రైల్లో వెళ్తుండగా కొడుకు పుట్టాడు.. పేరేమి పెట్టారో తెలిస్తే..!

బుర్హాన్పూర్: కరోనా కల్లోలం మధ్య ఓ శ్రామిక్ ‌రైల్లో స్వస్థలానికి వెళ్తున్న దంపతులకు కుమారుడు జన్మించడంతో వారు అతడికి ‘‘లాక్‌డౌన్’’ అని పేరు పెట్టారు. మధ్య ప్రదేశ్‌లోని బుర్హాన్పూర్‌‌లో శుక్రవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. రీనా (32) అనే మహిళ తన భర్త ఉదయభాన్ సింగ్‌తో కలిసి శ్రామిక్ ప్రత్యేక రైలులో బయల్దేరింది.  ముంబై నుంచి యూపీలోని తమ స్వస్థలమైన అంబేద్కర్ నగర్‌కు వారు వెళ్లాల్సి ఉంది. అయితే రైల్లో ఉండగానే ఆమెకు పురుటి నొప్పులు మొదలుకావడంతో అధికారులు సకాలానికి స్పందించి ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం రాత్రి బుర్హాన్‌పూర్ ఆస్పత్రిలో ఆమె ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. ‘‘ఇలాంటి పరిస్థితుల్లో అతడు జన్మించినందున అతడికి లాక్‌డౌన్ యాదవ్ అని పేరు పెట్టాలని నిర్ణయించాం..’’ అని రీనా పేర్కొంది. తన భార్యకు పురిటి నొప్పులు రావడంతో సాయం కోసం రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేశాననీ... వెంటనే అధికారులు స్పందించి తమను స్థానిక జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారని ఉదయభాన్ సింగ్ పేర్కొన్నాడు. 

Updated Date - 2020-05-24T04:39:25+05:30 IST