Abn logo
Aug 19 2021 @ 14:46PM

వృద్ధ దంపతుల కీచులాట

చిత్తూరు: జిల్లాలోని పలమనేరు పోలీస్‌స్టేషన్ ఎదుట వృద్ధ దంపతులు కీచులాడుకున్నారు. ఒకరి జుట్టు ఒకరి పట్టుకుని కొట్టుకున్నారు. దంపతులు కొట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోలేదు. వీరి పక్క నుంచే వెళ్తున్న పోలీసులు కూడా వీరిని ఆపకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 60 ఏళ్ల వయస్సులో దంపతులు ఇలా కొట్టుకోవడం ఏమిటని చూసిన వారు అవాక్కయ్యారు. వారిని ఆపేందుకు ఎవరూ ముందుకు రాలేదు. కాసేపు ఆగిన తర్వాత అక్కడి నుంచి వృద్ధ దంపతులు వెళ్లిపోయారు.