'కొవాగ్జిన్' ఎవరు తీసుకోరాదంటే..?

ABN , First Publish Date - 2021-01-19T19:51:19+05:30 IST

వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పలువురు దుష్ట్రభావానికి గురవుతున్నారంటూ వినిపిస్తున్న ..

'కొవాగ్జిన్' ఎవరు తీసుకోరాదంటే..?

న్యూఢిల్లీ: వ్యాక్సిన్ తీసుకున్న వారిలో పలువురు దుష్ట్రభావానికి గురవుతున్నారంటూ వినిపిస్తున్న ఆందోళనల నేపథ్యంలో టీకాకు ఎవరు దూరంగా ఉండాలన్న విషయాన్ని భారత్ బయోటెక్ ప్రకటించింది. అత్యవసర వినియోగం కింద భారత్ బయోటెక్ టీకా 'కొవాగ్జిన్‌'కు అనుమతులు లభించాయి. టీకాను ఎవరు తీసుకోరాదనే విషయాలను తెలియజేస్తూ భారత్ బయోటెక్ మంగళవారంనాడు ఒక ఫ్యాక్ట్ షీట్‌ను విడుదల చేసింది.


రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్లు, రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపించే ఔషధాలను వాడుతున్న వారు టీకాకు దూరంగా ఉండాలని పేర్కొంది. జ్వరంతో బాధపడుతున్న వ్యక్తులు, గతంలో అలర్జీ ఉన్నవారు, రక్తహీనత ఉన్నవారు, గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు, తీవ్రమైన ఆనారోగ్య సమస్యలు ఉన్నవారు కొవాగ్జిన్‌ను తీసుకోవద్దని సూచించింది. కొవాగ్జిన్ కాకుండా ఇతర కోవిడ్ టీకా తీసుకున్న వారు కూడా టీకాకు దూరంగా ఉండాలని పేర్కొంది.  వ్యాక్సిన్ తీసుకునే ముందు తమ మెడికల్ హిస్టరీని గురించి వైద్యులకు, వ్యాక్సిన్ ఆఫీసర్‌లకు తెలియజేయాలని, వారి సలహాలు, సూచనల మేరకు నడచుకోవాలని కోరింది.

Updated Date - 2021-01-19T19:51:19+05:30 IST