తగ్గినా.. తక్కువేమీ కాదు!

ABN , First Publish Date - 2020-08-02T10:58:52+05:30 IST

చాలారోజుల తర్వాత జిల్లాలో వెయ్యికి దిగువగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.

తగ్గినా.. తక్కువేమీ కాదు!

వెయ్యికి దిగువగా.. తాజాగా 876 పాజిటివ్‌లు 

వారం రోజులుగా 1200 నుంచి 1600 వరకు కేసులు

కాకినాడ అర్బన్‌లో 149, రూరల్‌లో 45 నమోదు

రాజమహేంద్రవరం అర్బన్‌లో 124, రూరల్‌లో 50 కేసులు 

13 మండలాల్లో 0 కేసులు.. తగ్గుముఖం పట్టినట్టేనా..

మొత్తం బాధితులు 21,271 మంది.. యాక్టివ్‌ కేసులు 14,538   

రికార్డు స్థాయిలో  6,744 మంది డిశ్చార్జి 


కాకినాడ (ఆంధ్రజ్యోతి) : చాలారోజుల తర్వాత జిల్లాలో వెయ్యికి దిగువగా కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. జూలై 31న జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మందికి కొవిడ్‌ పరీక్షలు చేస్తే 876 మందికి కరోనా సోకినట్టు శనివారం ఫలితాలు వెలువడ్డా యి. మొన్న జిల్లా వ్యాప్తంగా 20,395 కేసులుండగా, కొత్త కేసులు 876తో 21,271 పాజి టివ్‌లు నమోదయ్యాయి. ప్రస్తుతం 14,538 యాక్టివ్‌ కేసులుండగా, శనివారం 6,744 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇక కాకినాడ అర్బన్‌లో 149, రూరల్‌లో 45, రాజమహేంద్రవరం అర్బన్‌లో 124, రూరల్‌లో 50 కేసులు తాజాగా నమోదయ్యాయి. ప్రాంతాల వారీగా చూస్తే 13 మండలాల్లో ఒక్క కేసూ నమోదు కాలే దు.


మిగిలినచోట్ల నమోదైన కేసులు ఇలా.. అడ్డతీగలలో 12, అయినవిల్లి 2, ఆలమూరు 32, అల్లవరం 15, అమలాపురం 14, అంబాజీపేట 2, అనపర్తి 35, ఆత్రేయపురం 7, బిక్క వోలులో 32, దేవీపట్నం 3, గండేపల్లి 16, గంగవరం 1, గోక వరం 4, జగ్గంపేట 5, కపిలేశ్వరపురం 21, కరప 8, కాట్రేని కోన 11, కిర్లంపూడి 2, కోరుకొండ 10, కొత్తపేట 8, కూన వరం 9, మలికి పురం 1, మామిడికుదురు 1, మండపేట 3, ముమ్మిడివరం 1, నెల్లి పాక 13, పి గన్నవరం 8, పెద్దాపురం 12, ప్రత్తిపాడు 17, రాజానగరం 19, రాజవొమ్మంగి 5, రంపచోడవరం 10, రావులపాలెం 19, రాయవరం 22, రాజోలు 1, రౌతులపూడి 4, సఖినేటిపల్లి 6, సామర్లకోట 13, శంఖవరం 6, సీతానగ రం 15, తాళ్లరేవు 11, తొండంగి 5, తుని 20, ఉప్పలగుప్తం 14, వై రామవరం 3, ఏలేశ్వరం 30. 

Updated Date - 2020-08-02T10:58:52+05:30 IST