జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ ట్యాంకు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-06-21T08:07:04+05:30 IST

కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు, వైద్యపరికరాల కల్పనకు సీఎం జగన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.

జీజీహెచ్‌లో ఆక్సిజన్‌ ట్యాంకు ఏర్పాటు

  • రూ.52లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో సమకూర్చిన అపెక్స్‌ ప్రోజెన్‌ ఫుడ్స్‌ సంస్థ
  • ప్రజల ఆరోగ్య భద్రతకు మౌలిక వసతుల ఏర్పాటు: మంత్రి వేణు

జీజీహెచ్‌(కాకినాడ), జూన్‌ 20: కొవిడ్‌ వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య భద్రతకు భరోసా కల్పించేలా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పెద్దఎత్తున మౌలిక వసతులు, వైద్యపరికరాల కల్పనకు సీఎం జగన్‌ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. కాకినాడ జీజీహెచ్‌లో ఆదివారం రూ.52 లక్షల సీఎస్‌ఆర్‌ నిధులతో అపెక్స్‌ ప్రోజెన్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 20 కిలో లీటర్ల సామర్థ్యంగల ఆక్సిజన్‌ ట్యాంకును ఎంపీ వంగా గీత, కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డితో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొవి డ్‌ మొదటిదశ, రెండో దశల్లో మహమ్మారి నివారణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టిందన్నారు. సెకండ్‌వేవ్‌లో ఎక్కడా ఆక్సిజన్‌ కొరత లేకుండా ప్రభుత్వం ముందస్తుగా ఆక్సిజన్‌ ట్యాంకులను ఏర్పాటు చేసిందన్నారు. కరోనా కట్టడికి జిల్లా యంత్రాంగం కలెక్టర్‌ ఆధ్వర్యంలో విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. సీఎం జగన్‌ చర్యలతో ఆసుపత్రికి ప్రస్తుతం ఉన్న 30 కేఎల్‌నుంచి 50 సామర్ధ్యానికి ఆక్సిజన్‌ ట్యాంకులు అందుబాటులో ఉన్నాయన్నారు. సామాజిక బాధ్యతగా అపెక్స్‌ సంస్థ ముందుకు వచ్చి రోగులకు ప్రాణవాయువు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. దీంతోపాటు రూ.16లక్షల విలువైన రెండు వెంటిలేటర్లు అందించి తోడ్పాటు అందించారని అపెక్స్‌ సంస్థ చైర్మన్‌ కరుటూరి సత్యనారాయణమూర్తి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కె.సుబ్రహ్మణ్యచౌదరిలను అభినందించి, సత్కరించారు. కార్యక్రమంలో జేసీ కీర్తి చేకూరి, నోడల్‌ అధికారి సూర్యప్రవీణ్‌చంద్‌, డీసీఆర్‌ఎంవో డాక్టర్‌ అనిత, అనస్థీసియా ప్రొపెసర్‌ డాక్టర్‌ ఏ.విష్ణువర్థన్‌, పసుపులేటి శ్రీనివాస్‌, గోకాడ రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T08:07:04+05:30 IST