బాధితులకు ఏదీ భరోసా?

ABN , First Publish Date - 2021-04-30T15:48:35+05:30 IST

కొవిడ్‌ బాధితుల సంఖ్య..

బాధితులకు ఏదీ భరోసా?

వైద్య శాఖకు కాల్‌సెంటర్‌కు కుదరని సమన్వయం

జిల్లా యంత్రాంగంతో సైతం పొసగని పొత్తు

పర్యవేక్షణ లేమితో నామమాత్రంగా నోడల్‌ ఆఫీసర్లు

హాస్పిటల్స్‌ చుట్టూ బాధితులను తిప్పుతున్న వైనం 


కొవిడ్‌ బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది! ఆకి ్సజన్‌ లెవల్స్‌ పడిపోవటంతో హాస్పిటల్స్‌లో అడ్మిషన్ల కోసం బాధిత కుటుంబాలు చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు! వారి ఆవేదన తీర్చాల్సిన సంబంధిత శాఖలు సమన్వయం లోపంతో వారిని మరింత ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. ఈ కారణంగా అనేకమంది బాధితులు మృత్యుఒడిలోకి చేరుతున్నారు. 


గొల్లపూడికి చెందిన ఆట్ల రంగారెడ్డికి కరోనా పాజిటివ్‌ వచ్చింది.. హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంటున్నారు. మూడు రోజులకు ఆక్సిజన్‌ స్థాయి పడిపోవటంతో హాస్పిటల్లో చేర్పించేందుకు 104 కాల్‌ సెంటర్‌కు ఫోన్‌ చేశారు. కుటుంబ సభ్యుల వివరాలతోపాటు ఆక్సిజన్‌ లెవల్‌ 85శాతం ఉన్న విషయం కూడా సిబ్బంది తెలుసుకున్నారు. నిమ్రాలో 65వ నెంబర్‌ బెడ్‌ను కేటాయిస్తున్నట్టు తెలిపారు. కుటుంబ సభ్యులు బాధితుడిని నిమ్రాకు తీసుకెళ్లగా గేటు బయటే నిలిపేసి ఆక్సిజన్‌ లెవల్‌ 90శాతం పైబడి ఉన్న వారికే అడ్మిషన్స్‌ తేల్చడంతో బాధితుడు వీల్‌ఛైర్‌లోనే పడిగాపులు పడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు జిల్లా యంత్రాంగానికి తెలపగా ఆగమేఘాలపై జీజీహెచ్‌లో 85వ బెడ్‌ కేటాయించాలని నిర్ణయించి విజయవాడ జీజీహెచ్‌కు పంపారు. అక్కడ కూడా అర్ధరాత్రి 12 గంటల వరకు సిబ్బంది అడ్మిట్‌ చేసుకోలేదు. కలెక్టర్‌ రిఫర్‌ చేసినా సూపరింటెండెంట్‌ అంగీకరించలేదు. బాధితుడు రైల్వే మాజీ ఉద్యోగి కావటంతో రైల్వే హాస్పిటల్‌ను ఆశ్రయించగా ఎట్టకేలకు అడ్మిషన్‌ దక్కింది. ప్రస్తుతం బాధితుడు చికిత్స పొందుతున్నాడు. కొవిడ్‌ బాధితుల విషయంలో 104 కాల్‌ సెంటర్‌ ఏ విధంగా పనిచేస్తుంద న్నది ఇది ఉదాహరణ మాత్రమే! ఇలాంటివి అనేకం. 


ఆంధ్రజ్యోతి, విజయవాడ : కొవిడ్‌ బాధితులను హోమ్‌ ఐసోలేషన్‌లో ఉంచాలా? హాస్పిటల్స్‌లో చేర్పించాలా అని నిర్ణయించేందుకు జిల్లా యంత్రాంగం విజయవాడ సబ్‌ కలెక్టర్‌ కార్యాలయంలో, రాష్ట్ర స్థాయిలో హెచ్‌సీఎల్‌ క్యాంప్‌సలో 104 కాల్‌ సెంటర్లు ఏర్పాటయ్యాయి. కరోనా అనుమానిత లక్షణాలు లేదా పాజిటివ్‌ వచ్చినవారు ఈ కాల్‌ సెంటర్‌కు కాల్‌ చేస్తే వారు బాధితుల ఆరోగ్య పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని హోమ్‌ ఐసోలేషనా? హాస్పిటల్స్‌కు పంపాలా అన్నది నిర్ణయిస్తారు. వీరి ఆదేశాలను హాస్పిటల్స్‌ కూడా పాటించాల్సిందేనని జిల్లా యంత్రాంగం ఆదేశాలిచ్చింది. అయితే ఈ కాల్‌ సెంటర్స్‌తో బాధితులు రెండు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవేమంటే తాము చెప్పే విషయాలను పూర్తిగా వినకుం డా ఏదో ఒక నిర్ణయం తీసుకుని హాస్పిటల్‌కు రిఫర్‌ చేస్తున్నారు. తీరా బాధితుడు అక్కడికి వెళితే 90శాతంలోపు ఆక్సిజన్‌ లెవల్స్‌ పడిపోయినా చేర్చుకోమంటున్నారు. దీంతో బాధితులు, వారి కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణనాతీతం. 


ఆక్సిజన్‌ లెవల్స్‌ 90శాతం పైన ఉంటేనే నిమ్రాలో వైద్య సేవలు అందిస్తున్నపుడు 85శాతం ఉన్నవారిని అక్కడికి ఎందుకు పంపించారన్నది అంతు చిక్కని ప్రశ్న. దీన్ని బట్టి చూస్తే వైద్యశాఖ సిబ్బందికి, కాల్‌ సెంటర్‌ సిబ్బందికి సమన్వయం లేదన్నది సుస్పష్టం. కొవిడ్‌ సేవలందించేందుకు జిల్లాలో ప్రభుత్వాసుపత్రులతో పాటు అనేక ప్రైవేటు హాస్పిటల్స్‌కు కూడా జిల్లాయంత్రాంగం అనుమతులిచ్చింది. ఆయా హాస్పిటల్స్‌లో పర్యవేక్షణకు వీలుగా జిల్లాస్థాయి అధికారు లను నోడల్‌ ఆఫీసర్లను నియమించింది. కానీ వీరు ఆయా హాస్పిటల్స్‌లో చేస్తున్న పర్యవేక్షణ ఏమిటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. నోడ ల్‌ ఆఫీసర్లు ప్రతిరోజూ తమకు కేటాయించిన హాస్పిటల్‌ను సందర్శించి ఎంతమంది బాధితులు చికిత్స పొందుతున్నారు? ఎలాంటి ఇబ్బందులున్నాయి? అత్యవసర వైద్యసేవలు ఎవరికి అవసరం? అ లాంటి వారిని విజయవాడలోని జీజీహెచ్‌కు తరలించటం చేయాలి. కానీ నోడల్‌ ఆఫీసర్లు ఇవేమీ చేయటం లేదు. వైద్యశాఖ, ప్రజలతో నోడల్‌ ఆఫీసర్లకు ఎంతమాత్రం సమన్వయం లేదు. అంతేకాక ప్రజలు నోడల్‌ ఆఫీసర్లకు ఫోన్లు చేస్తే ఎత్తే పరిస్థితి కూడా లేదు. 



కొవిడ్‌ వార్డుల్లో.. కుటుంబ సభ్యులు

రైల్వే హాస్పిటల్స్‌లో కొవిడ్‌ బాధితులకు వారి కుటుంబ సభ్యులే వైద్య సేవలందించాల్సిన దుస్థితి దాపురించింది. ఇ లా కుటుంబ సభ్యులను కొవిడ్‌ వార్డుల్లోకి అనుమతించటం ప్రాణాలతో చెలగాటమాడటమే. వార్డు బయట వర కే అనుమతిస్తున్నామని చెబుతున్న రైల్వే హాస్పిటల్‌ వర్గాలు వారి సేవలను ఏవిధంగా వినియోగించుకుంటున్నారనే విషయా లు తాజాగా వెలుగులోకి వచ్చాయి. కొవిడ్‌వార్డులో చికిత్స పొందుతున్న బాధితులకు మందులు ఇవ్వటం నుంచి ఆహా రం అందించటం, నడిపించటం వంటి పనులన్నీ కుటుంబ సభ్యులే చేపడుతున్నారు. పోనీ వారికేమైనా పీపీఐ కిట్లయి నా ఇస్తున్నారంటే అదీలేదు. కేవలం మాస్కులు, ఖర్ఛీ్‌ఫతోనే లోపలికి వెళుతున్నారు. కొవిడ్‌ బాధితుల వార్డుల్లోకి వెళ్లకుం డా తప్పించుకునేందుకే వైద్య సిబ్బంది బాధిత కుటుంబ సభ్యులను అనుమతిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నా యి.డివిజినల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) దీనిపై విచారించి తక్షణం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Updated Date - 2021-04-30T15:48:35+05:30 IST