పాన్‌ మసాలా కోసం ఐసోలేషన్ వార్డు నుంచి పారిపోయిన కరోనా రోగి

ABN , First Publish Date - 2020-07-14T16:03:25+05:30 IST

ఓ కరోనా రోగి పాన్ మసాలా కోసం ఆసుపత్రి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలోని ఆసుపత్రిలో వెలుగుచూసింది....

పాన్‌ మసాలా కోసం ఐసోలేషన్ వార్డు నుంచి పారిపోయిన కరోనా రోగి

ఆగ్రా (ఉత్తర్‌ప్రదేశ్): ఓ కరోనా రోగి పాన్ మసాలా కోసం ఆసుపత్రి నుంచి పారిపోయిన ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నగరంలోని ఆసుపత్రిలో వెలుగుచూసింది. ఆగ్రాలోని ఎస్ఎన్ మెడికల్ కాలేజీలో కరోనాతో ఓ రోగి ఐసోలేషన్ వార్డులో చేరాడు. పాన్ మసాలా తినాలనే కోరికతో ఆసుపత్రి ఐసోలేషన్ వార్డు నుంచి తప్పించుకొని పారిపోయాడు. పాన్ షాపు కోసం గంటసేపు తిరిగి ఎట్టకేలకు పాన్ మసాలా ప్యాకెట్లు కొని జేబుల నిండా పెట్టుకున్నాడు. తనకు కరోనా ఉందనే విషయం చెప్పకుండా తన స్నేహితుడి ఇంటికి వెళ్లి వారితో గడిపాడు. తనను ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించమని కరోనారోగి తన స్నేహితుడిని అభ్యర్థించాడు. కరోనా రోగి కలిసిన స్నేహితుడి కుటుంబసభ్యులను క్వారంటైన్ చేశారు. కరోనా రోగి అతని స్నేహితుడి ఇంట్లో ఉండగా, అధికారులు పట్టుకొని అతన్ని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. కరోనా రోగిని ఐసోలేషన్ వార్డులో పరిశీలనలో ఉంచామని ఎస్ఎన్ వైద్యకళాశాల వైద్యులు చెప్పారు. 

Updated Date - 2020-07-14T16:03:25+05:30 IST