covid curb: రాజస్థాన్‌లో పండుగలపై నిషేధాస్త్రం

ABN , First Publish Date - 2021-07-17T14:55:49+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మతపరమైన పండుగలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాస్త్రం విధించింది...

covid curb:  రాజస్థాన్‌లో పండుగలపై నిషేధాస్త్రం

జైపూర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలో కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు మతపరమైన పండుగలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధాస్త్రం విధించింది.త్వరలో జరగనున్న కన్వర్ యాత్ర, ఈదుల్ జుహా పండుగల సందర్భంగా ఎలాంటి బహిరంగ మతపరమైన కార్యక్రమాలు చేపట్టరాదని రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.మధురలోని గోవర్థన ఏరియాలో ప్రతి ఏటా నిర్వహించే వార్షిక ముడియా పూనో మేళాను ఈ ఏడాది రద్దు చేశారు.చాతుర్మాస పండుగ సందర్భంగా భక్తులు గుమిగూడటాన్ని అనుమతించరు. 



అన్ని మతాల వారు తమ తమ మతపరమైన కార్యక్రమాలను ఇళ్లలోనే చేసుకోవాలని సర్కారు సూచించింది.రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం 522 కరోనా యాక్టివ్ కేసులు నమోదైనాయి. రాజస్థాన్ రాష్ట్రంలో మొత్తం 9,43,788 కరోనా కేసులు నమోదు కాగా, 8,947 మంది మరణించారు. రాజస్థాన్ లో 2,23,73,512 మందికి మొదటి డోసు కరోనా టీకాలు వేశారు. 51,27,110 మందికి కరోనా రెండో డోసు వేశారు.  

Updated Date - 2021-07-17T14:55:49+05:30 IST