కరోనా-ఇ టీకా.. గేమ్ చేంజర్
ABN , First Publish Date - 2021-06-18T16:34:50+05:30 IST
బయోలాజికల్ ఇ టీకా ‘కోర్బెవాక్స్’ కరోనాపై పోరులో గేమ్ చేంజర్‌గా మారే అవకాశం ఉందని ...
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల వ్యాక్సిన్లు వచ్చాయి. దేశీయంగా కోవాగ్జిన్, కొవిషీల్డు, రష్యా డెవలప్ చేసిన స్పుత్నిక్ వి ఉంది. వాటితో పాటు మరికొన్ని దేశీయ వ్యాక్సిన్‌లు అందుబాటులోకి రాబోతున్నాయి. భారత్‌లోనే తయారవుతున్న బయోలాజికల్ ఇ టీకా ‘కోర్బెవాక్స్’ కరోనాపై పోరులో గేమ్ చేంజర్‌గా మారే అవకాశం ఉందని కోవిడ్ వర్కింగ్ గ్రూప్ ఛైర్ పర్సన్ ఎన్‌కే అరోడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ టీకా ప్రభావ శీలత దాదాపు 90 శాతం వరకు ఉండవచ్చునని ఆయన అంచనా వేశారు. ఆ టీకా ఫేజ్ 3 ట్రయల్స్ జరుగుతున్నాయని అక్టోబర్ నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అరోడా తెలిపారు.