దయచేసి పువ్వాడ నాగేశ్వర్‌రావు పేరు ప్రస్తావించవద్దు: నారాయణ

ABN , First Publish Date - 2020-12-03T16:06:51+05:30 IST

: మంత్రి పువ్వాడ అజయ్‌‌పై సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు.

దయచేసి పువ్వాడ నాగేశ్వర్‌రావు పేరు ప్రస్తావించవద్దు: నారాయణ

హైదరాబాద్: మంత్రి పువ్వాడ అజయ్‌‌పై సీపీఐ నేత నారాయణ తీవ్రస్థాయిలో విరుచుకుడ్డారు. దయచేసి పువ్వాడ నాగ్వేశ్వర్‌రావు, సీపీఐ పేరును ప్రస్తావించవద్దని కోరారు. ఈమేరకు నారాయణ పత్రికా ప్రకటనను విడుదల చేశారు. పువ్వాడ, తాను సీపీఐలోనే కొనసాగుతున్నామని తెలిపారు. ఒకప్పుడు తమకు జగన్‌మోహన్‌రెడ్డి, తర్వాత దిగ్విజయ్‌సింగ్, తాజాగా కేసీఆర్ నాయకులని వ్యాఖ్యానించారు. ఇంత పరకాయ ప్రవేశం చేసిన వారు చెట్టు పేరు చెప్పుకుని కాయలమ్మేపని చేయవద్దని హితవు పలికారు. తనపై మంత్రి చేసిన విమర్శలపై సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తాను ఉమ్మడి రాష్ట్ర సీపీఐ కార్యదర్శిగా ఉన్నా ఉమ్మడిగానే నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. కొన్ని సందర్భాలలో ఆనాటి సీపీఐ ప్రధాని కార్యదర్శి బర్దన్, సురవరం సుధాకర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శివర్గంతో పాటు పువ్వాడ కూడా కలిసే నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. పువ్వాడ నాగేశ్వర్‌రావు ఆనాడు తమ పార్టీ నాయకులని... ఈనాడు కూడా పార్టీ వెంటనే ఉంటారని స్పష్టం చేశారు.


ఖమ్మం పార్లమెంటుకు అభ్యర్థిగా పువ్వాడనే పోటీచేయమని అభ్యర్థించామని...అందుకు ఆయన అంగీకారించారని నారాయణ తెలిపారు. అయితే తానెలా అబ్యర్థినయ్యాని ప్రశ్నించారు. ఖమ్మం జిల్లా పార్టీ అనుమతిలేకుండా , రాష్ట్ర కార్యదర్శివర్గం తీర్మానం లేకుండా , కేంద్రపార్టీ అనుమతిలేకుండా తాను పొటీ చేయగలనా అని నిలదీశారు. విజ్ఞతతో ఆలోచించమని ప్రజలను ముఖ్యంగా ఖమ్మం ప్రజలను కోరుతున్నానని అన్నారు. పార్టీ నిబంధనల రీత్యా అంతకు మించి వివరాలు చెప్పలేనని తెలిపారు. తనపై అవినీతిని అంటగట్టాలనే ప్రయత్నం ప్రజల విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అవినీతికి పాల్పడి ఉంటే కేంద్ర కార్యదర్శి వర్గ స్థాయికి ఎదగగలనా అని ప్రశ్నించారు. "కేసీఆర్ వదిలిపెట్టిన చెవితెగుద్ది" అనడం ద్వారా కేసీఆర్ కన్నా తానే గొప్పవాడని అని బరితెగించి చెప్పుకున్నారని... దానిని కేసీఆర్ పరిశీలించుకోవాల్సిందే అని అన్నారు.


తనపై బీజేపీ హత్యాప్రయత్నం చేసిందని స్వయగా మంత్రే చెప్పారని...ఇది రాజకీయాలకు అతీతంగా తీవ్రంగా పరిగణించాల్సిన అంశమని పేర్కొన్నారు. మరి ఆప్రకారం స్పందన ప్రభుత్వం నుండి ఉందా అని సీపీఐ నేత నిలదీశారు. ‘‘యువకుడుగా ఆర్టీసకీ మంత్రివయ్యావు , హిట్ అండ్ రన్ యాక్ట్ తీవ్రతను గురించి తెలిసుకోవాలసిన కనీస బాద్యత నీకుంది. నేను విద్యార్థి దశ నుండి సీపీఐలోనే ఉన్నాను. మీరెక్కడ నుండి బయలుదేరారో, ఇప్పుడెక్కడ ఉన్నారో,  రేపెక్కడికిపోతారో చెప్పగలరా? సూర్యుడిపై ఎంగి ఊస్తే ఏమవుతుందో నన్నంటే అదే అవుతుందని అజయ్ బాబు గుర్తుంచుకోవడం మంచిది’’ అంటూ సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. 

Updated Date - 2020-12-03T16:06:51+05:30 IST