Advertisement
Advertisement
Abn logo
Advertisement

సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలు కాదు: Ramakrishna

అమరావతి: పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసేందుకు జగన్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించరు. 73, 74 వ రాజ్యాంగ సవరణ చట్టానికి వైసీపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సర్పంచులతో కాకుండా పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌లతో జెండా ఎగురవేయించటం సరికాదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్‌ల హక్కులను కాలరాస్తూ ఆదేశాలిస్తోందని మండిపడ్డారు. నిధులు, విధులు, అధికారాల విషయంలో చట్ట వ్యతిరేక జీవోలను ఇవ్వడాన్ని ఖండిస్తున్నామన్నారు. సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలు కాదని రామకృష్ణ స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement