Advertisement
Advertisement
Abn logo
Advertisement

మేడికొండూరు ఘటనలో దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి: Ramakrishna

అమరావతి: గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పాలడుగు అడ్డరోడ్డు వద్ద వివాహిత మహిళపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. బైక్‌పై వెళుతున్న దంపతులను దుండగులు అడ్డగించి కత్తులతో బెదిరించి గ్యాంగ్ రేప్ చేయటం అమానుషమన్నారు. ఫిర్యాదు తీసుకోకుండా మేడికొండూరు పోలీసులు తమ పరిధి కాదనటం దుర్మార్గమని మండిపడ్డారు.  దిశ చట్టం, జీరో ఎఫ్ఐఆర్‌లు కేవలం ప్రచారాలకే పరిమితమా? అని నిలదీశారు. ఏపీలో అరాచకం, మహిళలపై దురాగతాలు పేట్రేగిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. దోషులను తక్షణం గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు నమోదు నిరాకరించిన పోలీసులపై చర్యలు చేపట్టాలని రామకృష్ణ అన్నారు. 

Advertisement
Advertisement