Advertisement
Advertisement
Abn logo
Advertisement

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. హంద్రీ నీవా ప్రధాన కాలువలో నీరు పుష్కలంగా ఉన్నప్పటికీ వినియోగంలోకి రాలేదన్నారు. హంద్రీ నీవా ప్రధాన కాలువ ద్వారా 106 చెరువులు నింపవచ్చని తెలిపారు. 150 గ్రామాలకు తాగునీరు, దాదాపు 10 వేల ఎకరాలకు పైగా సాగునీరు అందించవచ్చన్నారు. ఇందుకోసం నిధులను కేటాయించినప్పటికీ సగం మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు.తక్షణమే హంద్రీనీవా ద్వారా చెరువులు నింపి ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీరు అందించాలని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement