Advertisement
Advertisement
Abn logo
Advertisement

AP: సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

అమరావతి: విద్యుత్ చార్జీల పెంపుపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో వైసీపీ అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని, ఇంకా తగ్గిస్తామంటూ ఇచ్చిన హామీ తుంగలో తొక్కారని మండిపడ్డారు. ట్రూఅప్ విద్యుత్ చార్జీల పేరుతో రూ.3669 కోట్ల భారాన్ని ప్రజలపై మోపడం తగదన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక గత 27 మాసాల కాలంలో 4 సార్లు విద్యుత్ ఛార్జీలను పెంచారని తెలిపారు. కేవలం రూ.2,500 కోట్ల అప్పుకు ఆశపడి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ షరతులకు రాష్ట్ర ప్రభుత్వం సై అంటోందని విమర్శించారు. అసలే కరోనా కష్టకాలంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల నెత్తిపై ఆస్తి, చెత్త పన్నుల పెంపు, విద్యుత్ చార్జీల గుదిబండ సరికాదన్నారు. విద్యుత్ చార్జీల భారాన్ని విరమించకపోతే మరో విద్యుత్ ఉద్యమం తప్పదని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు. 

Advertisement
Advertisement