Advertisement
Advertisement
Abn logo
Advertisement

వరద బాధితులను ఆదుకోండి: సీపీఐ

వన్‌టౌన్‌, నవంబరు 28: చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు, వరదలతో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం 53వ డివిజన్‌లోని హనుమంతరాయమార్కెట్‌ వద్ద నుంచి వరద బాధితుల కోసం విరాళాల సేకరణను ప్రారంభించారు. అనేక మంది నివాసాలు, పంటలు, కొందరు ప్రాణాలు కోల్పోయారని, బాధితులను ఆదుకోవాలని ఆయన సూచించారు. డివిజన్‌ ఇన్‌చార్జి కార్యదర్శి కొట్టు రమణరావు, నాయకులు డీవీ రమణబాబు, తాతయ్య, రాయన గురునాఽథం, బైపిల్ల సత్యనారాయణ, బియ్యపు ఏడుచేపల కృష్ణారావు, చిన్న, మారుతి, కనకారావు, కొట్టు విజయలక్ష్మి విరాళాల సేకరణలో పాల్గొన్నారు. అనారోగ్యంతో కొంతకాలంగా నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న సీనియర్‌ నాయకుడు పల్లా సూర్యారావును సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ పరామర్శించారు. సూర్యారావు సతీమణి, పార్టీ నాయకురాలు దుర్గాంబ నుంచి వివరాలు సేకరించారు. 


Advertisement
Advertisement