పెట్రో, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన

ABN , First Publish Date - 2021-06-04T05:20:49+05:30 IST

దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు డిమాండ్‌ చేశారు.

పెట్రో, డీజిల్‌ ధరల పెంపుపై నిరసన
కర్నూలులో నిరసన తెలుపుతున్న నాయకులు

కర్నూలు(న్యూసిటీ), జూన్‌ 3: దేశవ్యాప్తంగా పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తక్షణమే తగ్గించాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు డిమాండ్‌ చేశారు. గురువారం సీపీఐ కార్యాలయం ఎదుట సీపీఐ, ప్రజాసంఘాలు నిరసన చేపట్టాయి. రామాంజనేయులు మాట్లాడుతూ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పటికి దేశంలో మాత్రం పెట్రోల్‌ ధరలు పెంచడం దారుణమన్నారు. వంటగ్యాస్‌తోసహ అన్ని నిత్యావసర  వస్తువుల ధరలు పెరగడంతో సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.  ఏఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఏఐటీయూసీ రాష్ట్ర సీనియర్‌ నాయకులు మనోహర్‌ మాణిక్యం, నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, డీహెచ్‌పీఎస్‌ జిల్లా కార్యదర్శి మహేష్‌, ఆటో  యూనియన్‌ నాయకులు ఈశ్వర్‌ పాల్గొన్నారు. 


పత్తికొండటౌన్‌: పట్టణంలోని సీపీఐ కార్యాలయం ఆవరణలో నిరసన చేపట్టారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామచంద్రయ్య, మండల, పట్టణ కార్యదర్శులు రాజాసాహెబ్‌, సురేంద్రనాథ్‌, ప్రజా సంఘాల నాయకులు గురుదాసు, తిమ్మయ్య, మాదన్న, ఈరన్న, మద్దిలేటి  పాల్గొన్నారు. 


డోన్‌(రూరల్‌): పట్టణంలోని సీపీఐ సర్కిల్‌లో నిరసన తెలిపారు. సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి రంగనాయుడు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుంకయ్య, సీపీఐ, అనుబంధ సంఘాల నాయకులు నక్కి శ్రీకాంత్‌, లక్ష్మీనారాయణ, పులిశేఖర్‌, సుగుణమ్మ, అబ్బాస్‌, పుల్లయ్య, పాల్గొన్నారు. 


కోడుమూరు: పట్టణంలోని పాతబస్టాండ్‌లో నిరసన తెలిపారు. సీపీఐ పట్టణ కార్యదర్శి అల్లినగరం రాముడు, సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు క్రిష్ణ, రాజు, రమేష్‌, సుంకన్న, మద్దిలేటి, జానీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-04T05:20:49+05:30 IST