Advertisement
Advertisement
Abn logo
Advertisement

నేటి నుంచి సీపీఎం జిల్లా మహాసభలు

 హాజరుకానున్న తమ్మినేని వీరభద్రం 

మరోసారి ముదిరెడ్డి, మల్లు, జహంగీర్లకు అవకాశం  

నల్లగొండ, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): గత పోరాటాలు, భవిష్యత కార్యాచరణ ఖరారు చేసుకునే క్రమంలో సీపీఎం జిల్లా మహాసభలను ప్రారంభించనుంది. ఈ సభలను ఘనంగా నిర్వహించాలని మూడు రోజులపాటు షెడ్యూల్‌ ఖరారు చేసి చివరిరోజు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించినా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో అవి రద్దయ్యాయి. ముందుగా నల్లగొండ జిల్లా మహాసభలు ఈనెల 17,18 తేదీల్లో నల్లగొండ పట్టణంలో జరగనున్నాయి. డిసెంబరులో సూర్యాపేట, యాదాద్రి జిల్లాల మహాసభలు జరగనున్నాయి. యాదాద్రి జిల్లా సభ డిసెంబరు 5,6 తేదీల్లో జరగనుంది. నల్లగొండ పట్టణంలోని ఎంఏ బేగ్‌ ఫంక్షనహాల్‌లో సీపీఎం జిల్లా మహాసభలు ఈనెల 17న ఉదయం 10గంటలకు ప్రారంభంకానున్నా యి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరభద్రం ఓపెన సెషనలో ప్రారంభ సందేశం ఇస్తారు. మధ్యాహ్నం ప్రతినిధుల చర్చలు మొదలవుతాయి. జిల్లా మొత్తంగా 411 మంది ప్రతినిధులు ఈ సభలకు హాజరుకానున్నారు. 


18న నూతన కమిటీ ఎన్నిక

ఈ నెల 18వ తేదీన జిల్లా నూతన కమిటీని ఎన్నుకోనున్నారు. ప్రస్తుతం జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి కొత్త జిల్లాల ఏర్పాటు నుంచి ఆయనే కొనసాగుతున్నారు. పార్టీ నిబంధనల ప్రకా రం ఓ కమిటీని మూడేళ్ల కాల పరిమితికి ఎన్నుకుంటారు. వరుసగా మూ డుసార్లు ఒక వ్యక్తి ప్రధాన కార్యదర్శిగా కొనసాగే అవకాశం ఉంది. 2017లో ముదిరెడ్డి ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లోకి రాగా రెండు పర్యాయాలు ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితులు, రాబోయే సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముదిరెడ్డికి వరుసగా మూడోసారి అవకాశం కల్పిం చే యోచనలో పార్టీ నేతలు ఉన్నట్లు తెలిసింది. ఇదే తరహాలో ప్రస్తుతం సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న మల్లు నాగార్జునరెడ్డికి డిసెంబరులో జరగనున్న ఆ జిల్లా మహాసభల్లో మరోసారి అవకాశం కల్పించే యోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్లు సమాచారం. డిసెంబరు 5, 6 తేదీల్లో యాదాద్రి జిల్లా మహాసభలు జరగనున్నాయి. ఆ కమిటీకి మూడోసారి జహంగీర్‌కే బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలిసింది.  

Advertisement
Advertisement