Abn logo
Nov 28 2020 @ 00:07AM

పంపు సెట్లకు మీటర్లతో ఉచిత విద్యుత్‌కు గండి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు 

ద్వారకా తిరుమల, నవంబరు 27 : వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను బిగించడం ద్వారా రైతులు భవిష్యత్‌లో ఉచిత విద్యుత్‌ను కోల్పోతారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర రైతు సంఘాల పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ద్వారకా తిరుమల మండలం ఎం.నాగులాపల్లి గ్రామ సచివాలయం వద్ద మీటర్లు వద్దంటూ శుక్రవారం ధర్నా చేశారు. ఈ సంద ర్భంగా నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడుతూ కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేయాలని డిమాండ్‌ చేశారు. రైతుల పోరాటా లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు మంతెన సీతారాం మాట్లా డుతూ కేంద్ర వ్యవసాయ చట్టాల వల్ల రైతులు మద్దతు ధర కోల్పోతారని ఆరోపించారు. రైతు సంఘం జిల్లా కార్య దర్శి కె.శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షుడు జి.ప్రసాదరావు, సీఐ టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement