స్వీట్ తినాలనిపిస్తే?
ABN , First Publish Date - 2020-11-24T05:33:41+05:30 IST
ఒత్తిడి, అలసట, నిద్రలేమి... తీపి తినాలనిపించటానికి ప్రధాన కారణాలు. శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించటం కోసం తీపి మీదకు మనసు మళ్లుతుంది
- ఒత్తిడి, అలసట, నిద్రలేమి... తీపి తినాలనిపించటానికి ప్రధాన కారణాలు. శక్తి తగ్గినప్పుడు శరీరానికి తక్షణ శక్తి అందించటం కోసం తీపి మీదకు మనసు మళ్లుతుంది. ఈ ఫీలింగ్ రాగానే తీపి పదార్థాల కోసం వెతకకండి. ఒకసారి తీపి తినటం మొదలుపెడితే అది అలాగే అలవాటు అవుతుంది. కాబట్టి స్వీట్ల జోలికి వెళ్లకుండా మూల కారణాల్ని సరిదిద్దటం మీద మనసు పెట్టండి.
- స్వీట్ల మీద ఇష్టం పెరగటానికి వ్యాయామం లేకపోవటం మరో కారణం. శరీరం చురుగ్గా లేనప్పుడు బద్ధకం ఆవరిస్తుంది. దాంతో మనసు కప్ కేక్స్, చాక్లెట్ల మీదకు మళ్లుతుంది. కాబట్టి ఏదో ఒక శారీరక వ్యాయామం చేయడం తప్పనిసరి.
- షుగర్ క్రేవింగ్కు డీహైడ్రేషన్ మరో కారణం. శరీరంలో నీటి శాతం తగ్గినప్పుడు చక్కెర పదార్థాలు తినాలనిపిస్తుంది. ఈ కోరిక కలగకూడదంటే వెంటనే నీళ్లు తాగాలి.