కుటుంబం కిడ్నాప్‌

ABN , First Publish Date - 2020-12-04T05:58:17+05:30 IST

తాడేపల్లిగూడెంకు చెందిన ఒక కుటుంబాన్ని కొందరు కిడ్నాప్‌ చేసి హైద్రాబాద్‌ తరలిస్తుంటే చింతలపూడి వద్ద ఆ కుటుంబం తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది.

కుటుంబం కిడ్నాప్‌
పోలీస్‌స్టేషన్‌ వద్ద వేచి వున్న బాధితులు

తప్పించుకుని పోలీసులను ఆశ్రయించిన బాధితులు

తాడేపల్లిగూడెంలో కలకలం

చింతలపూడి/తాడేపల్లిగూడెం క్రైం, డిసెంబరు 3 : తాడేపల్లిగూడెంకు చెందిన ఒక కుటుంబాన్ని కొందరు కిడ్నాప్‌ చేసి హైద్రాబాద్‌ తరలిస్తుంటే చింతలపూడి వద్ద ఆ కుటుంబం తప్పించుకుని పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు, బాధితులు తెలిపిన వివరాలివి.. తాడేపల్లిగూడెం కు చెందిన శివప్రసాద్‌, భార్య సౌజన్య ఏడాది క్రితం హైద రాబాద్‌కు చెందిన మధు అనే వ్యక్తి నుంచి మలేషియాకు పంపించాలని కోటిన్నరకుపైగా విలువైన బట్టలు తీసుకున్నా రు. ఏడాది కావస్తున్నా డబ్బుల విషయంలో సమాధానం చెప్పకపోవడంతో వారు శివప్రసాద్‌, భార్య సౌజన్యలపై ఫిర్యాదుచేశారు. ఈ కేసులో ఇరువురిని పోలీసులు అరెస్టు చేయగా, బెయిల్‌పై తాడేపల్లిగూడెం వచ్చారు. ఈ క్రమంలో వారి నుంచి సొమ్ములు తీసుకునేందుకు రాఘవేంద్ర అనే వ్యక్తి ద్వారా శివప్రసాద్‌, సౌజన్య, వీరి కుమార్తె నక్షత్రలను బుధవారం రాత్రి కారులో ఎక్కించి జంగారెడ్డిగూడెం తీసుకు వచ్చారు. గురువారం హైదరాబాద్‌ తీసుకెళ్లేందుకు ప్రణాళిక వేసుకున్నారు. ఇది పసిగట్టిన శివప్రసాద్‌ చింతలపూడి వచ్చేసరికి బహిర్బూమికి వెళ్లాలని చెప్పి కారు దిగి అక్కడ నుంచి పారిపోయి పోలీసులను ఆశ్రయించాడు. ఎస్‌ఐ స్వామి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులను, కారును, నిందితులను స్టేషన్‌కు తరలించారు. దీనిపై అక్కడ విచారించి ఈ కేసు తాడేపల్లిగూడెం తరలించారు. తాడేపల్లి గూడెంలో సీఐ ఆకుల రఘు విచారిస్తున్నారు. దీనిపై ప్రస్తు తం ఎలాంటి కేసు నమోదు కాలేదు. 

Updated Date - 2020-12-04T05:58:17+05:30 IST