Abn logo
Dec 3 2020 @ 01:00AM

నేర సమాచారం

రైలు నుంచి జారిపడి వృద్ధుడి మృతి..


అనంతపురం రైల్వే, డిసెంబర్‌ 2: రైలు నుంచి జారిపడి ఓ వృద్ధుడు (55) బుధవారం మృతి చెందాడు. తాటిచెర్ల రైల్వేస్టేషన్‌ ఉదయం 7 గంటల సమయంలో రన్నింగ్‌లో ఉన్న రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తిగా రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 


============================================================

చిన్నమదర్‌ (ఫైల్‌)


చేనేత కార్మికుడి ఆత్మహత్య 

హిందూపురం టౌన్‌, డిసెంబరు 2 : పట్టణంలోని చౌడేశ్వరీకాలనీలో నివాసమున్న చేనేత కార్మికుడు చిన్నమదర్‌(48) విషద్రావకం తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు వన్‌టౌన్‌ ఎఎ్‌సఐ వెంకటరాముడు తెలిపారు. చౌడేశ్వరీకాలనీలో నివాసమున్న మదర్‌ కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నాడన్నాడు. దీనికితోడు లాక్‌డౌన్‌ కారణంగా మగ్గాలు నడవకపోవడంతో మరిన్ని అప్పులు చేశాడన్నాడు. దీనికితోడు ఇటీవల కాలంలో తాగుడుకు బానిసై అప్పులు ఎలా తీర్చాలని మదనపడుతూ మంగళవారం సాయంత్రం ఇంటిలో విషద్రావకం తాగాడు. గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించారు. వైద్యులకు తెలియకుండా ఇంటికి వెళ్లిపోయాడు. కానీ అర్ధరాత్రి సమయంలో రక్తం కక్కుతుండటంతో మరోసారి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో అనంతపురం ఆసుపత్రికి తరలించడానికి ప్రయత్నిస్తుండగా మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎఎ్‌సఐ తెలిపారు.


===========================================================

మహిళా మృతదేహం

గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

చిలమత్తూరు, డిసెంబరు 2:  మండలంలోని దేమకేతేపల్లి సమీపంలోని హంద్రీనీవా కాలువలో బుధవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు ఎస్‌ఐ రంగడు యాదవ్‌ తెలిపారు. ఈమె వయస్సు సుమారు 45 ఏళ్లు ఉంటుందని, నీలం రంగు నైటీ, దానిపై నలపు రంగు స్వెటర్‌ ధరించి ఉందన్నారు. మృతరాలు ఎవరనేది తెలియరాలేదని, ఎవరైనా మృతదేహం గుర్తించి ఆచూకీ తెలపాలని ఆయన కోరారు. ఆచూకీ తెలిసినట్లైతే 9440901877 నంబర్‌కి ఫోన్‌ చేయాలన్నారు.

=============================================================

రక్తపు మడుగులో నారాయణస్వామి మృతదేహం

కొడుకు, కోడలి చేతిలో హత్య!

మామిళ్లపల్లిలో దారుణం 

కనగానపల్లి, డిసెంబరు2: కుటుంబ కలహాలు హత్యకు దారి తీశాయి. బంధాలు, బంధుత్వాలు మరచి కన్న కొడుకు చేతిలో ఓ తండ్రి హతమయ్యాడు. ఈ హత్యకు మూడు నెలల క్రితమే వివాహమై ఇంటికొచ్చిన కోడలు సైతం సహకరించింది. సభ్యసమాజం తలదించుకునే ఈ అమానవీయ ఘటన కనగానపల్లి మండలం మామిళ్లపల్లి గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.  మా మిళ్లపల్లి పూసలకాలనీలో నారాయణస్వామి(43), నారాయణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు సంతానం. నారాయణస్వామి రెండవ కుమారుడైన గణే్‌షకు మూడునెలల క్రితం గోరంట్లకు చెందిన అనిత అనే అమ్మాయితో వివాహం జరిగింది. మద్యం మత్తులో ఉన్న నారాయణస్వామి ఇంటికిరాగానే కొడుకు గణేష్‌, కోడలు అనితలు గొడవ పడ్డారు. దీంతో కోపోద్రిక్తుడైన కొడుకు గణేష్‌ తం డ్రిపై గొడవకు దిగాడు. ఇందుకు భర్త చేతికి వేటకొడవలిని ఇచ్చిన కోడలు హత్యకు సహకరించింది. దీంతో కొడుకు, కోడలు కలసి నారాయణస్వామిపై వేటకొడవలితో దాడిచేశారు. ఈ దాడిలో నారాయణస్వామి అక్కడికక్కడే కూప్పకూలిపోయి మృతిచెందాడు. స్థానికులు గమనించి పోలీసులు సమాచారం అందించారు. వెంటనే కనగానపల్లి ఎస్‌ఐ సత్యనారాయణ హుటాహుటినా సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement