నిషేధిత ఎరువులు, మందులు అమ్మితే క్రిమినల్‌ కేసులు

ABN , First Publish Date - 2021-06-20T04:59:23+05:30 IST

ప్రభుత్వం నిషేధించిన రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారెడ్డి హెచ్చరించారు.

నిషేధిత ఎరువులు, మందులు అమ్మితే క్రిమినల్‌ కేసులు

కడప (నాగరాజుపేట), జూన్‌ 19: ప్రభుత్వం నిషేధించిన రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందులు అమ్మితే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని వ్యవసాయ శాఖ ఏడీఏ నరసింహారెడ్డి హెచ్చరించారు. స్థానిక ఏడీఏ కార్యాలయంలో శనివారం కడప డివిజన్‌ డీలర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీఏ మాట్లాడుతూ ప్రభుత్వం అనుమతించిన బయో ప్రాడక్టులను మాత్రమే అమ్మాలన్నారు. లేనిపక్షంలో లైసెన్సు రద్దు చేసి క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 


జిల్లాకు 1259 మెట్రిక్‌ టన్నుల యూరియా 

జిల్లాకు 1259 మెట్రిక్‌ టన్నుల యూరియా వచ్చిందని ఏడీఏ నరసింహారెడ్డి తెలిపారు. ఇందులో 820 మెట్రిక్‌ టన్నుల యూరియా మనగ్రోమోర్‌ కేంద్రాలకు తరలించామన్నారు. 447 మెట్రిక్‌ టన్నులు యూరియా డీలర్లకు సరఫరా చేశామన్నారు. 

Updated Date - 2021-06-20T04:59:23+05:30 IST