Advertisement
Advertisement
Abn logo
Advertisement

24 గంటల్లోగా పంట నష్టం వివరాలు నమోదు చేయాలి

కలెక్టర్‌ నాగలక్ష్మి  

అనంతపురం, నవంబరు 29(ఆంధ్రజ్యోతి):  వర్షాలు, వరదలతో నష్టపోయిన పంట వివరాలను 24 గంట ల్లోగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆ దేశించారు. పంట నష్టం వివరాలను సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు. ఆ వివరాల్లో ఏవైనా తేడాలుంటే మార్పులు, చేర్పులకు రైతులకు వారం రోజులు అవకాశం కల్పించాలన్నారు. రబీకి సంబంధించి ఈ-క్రాప్‌ బుకింగ్‌ వెంటనే చేపట్టాలని సూచించారు. సోమవారం ఆమె కలెక్టరేట్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. పంట నష్టం వివరాల నమోదు, గృహహక్కు పథకం- వనటైమ్‌ సెటిల్‌మెంట్‌పై సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ డిసెంబరు 2 నుంచి సంపూర్ణ గృహహక్కు పథకంపై మెగా మేళాను నిర్వహించాలన్నారు.  పథకంపై అపోహలు సహజమని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. డీఆర్‌డీఏ, మెప్మాల సహకారంతో ఆశావహులకు రుణాలు ఇప్పించి పథకంలో భాగస్వాములను చేయాలన్నారు. ఒక్కో సచివాలయం రో జుకు కనీసం ఐదుగురికి సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలన్నారు. 90 రోజుల్లో ఇళ్ల పట్టాల దరఖాస్తుల్లో అర్హులను గుర్తించి వారికి అవసరమైన భూములను గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. డిసెంబరు 21న లబ్ధిదారులకు పట్టాలందించే కార్యక్రమానికి సర్వం సిద్ధం చేయాలన్నారు. జలకళకు సంబంధించిన దరఖాస్తుల్లో అర్హులకు అప్రూవల్‌ పూర్తి చేయాలని వీఆర్వోలను ఆదేశించారు. జగనన్న తోడుకు సంబంధించి డిసెంబరు మొదటివారంలో పాత దరఖాస్తుల రెన్యువల్‌, కొత్త దరఖాస్తుల స్వీకరణ చేపట్టాలన్నారు. గ్రామ, వార్డు, సచివాలయ ఉద్యోగుల హాజరు 90 శాతం తక్కువ కాకుండా చూసుకోవాలన్నారు.  కార్యక్రమంలో జేసీలు సిరి, నిశాంతి, గంగాధర్‌గౌడ్‌, సీపీఓ ప్రేమ్‌చంద్‌, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, హౌసింగ్‌ పీడీ కేశవనాయుడు, పీఆర్‌ ఎస్‌ఈ భాగ్యరాజ్‌, డ్వామా పీడీ విజయ్‌ప్రసాద్‌, వ్యవసా య శాఖ జేడీ చంద్రానాయక్‌, మండల ప్రత్యే కాధికారు లు  పాల్గొన్నారు.


పాలసేకరణకు సిద్ధం కావాలి : కలెక్టర్‌ 

జగనన్న పాలవెల్లువ కింద పాల సేకరణకు అన్ని విధాలా సిద్ధం కావాలని కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను ఆదేశించా రు. సోమవారం ఆమె  జేసీ సిరితో కలిసి కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి పెనుకొండ సబ్‌కలెక్టర్‌ నవీన, అనంతపురం, కదిరి ఆర్డీఓలు మధుసూదన, వెంకటరెడ్డి, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం అమలు తీరుపై వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు.  కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్న పాలవెల్లువ కింద జిల్లాలో ఎంపిక చేసిన క్లస్టర్లలో అక్టోబరు నెలలో గ్రామాల గుర్తింపు మొదలుపెట్టి మెంటర్‌, ప్రమోటర్‌, సెక్రటరీలను ఎంపిక చేశామన్నారు. పాలవెల్లువ ద్వారా గ్రామీణ లబ్ధిదారుల్లో ఆర్థిక కార్యకలాపాలు పెంపొందించే అవకాశముందని, జిల్లాలో ఎంపిక చేసిన ఆయా క్లస్టర్ల పరిధిలోని 14 మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాలవెల్లువ కార్య క్రమం సక్రమం గా అమలు చేయాలన్నారు.  మంగళ, బుధవారం రెండు రోజుల పాటు పరికరాలు ఎలా ఆప రేట్‌ చే యాలి, పాలు ఎలా తీసుకోవాలి తదితర అంశాలపై అమూల్‌ సంస్థ తరపున వచ్చిన ట్రైనర్స్‌ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాలకు డిజిటల్‌ అసిస్టెంట్లు, పశుసంవర్థకశాఖ అసిస్టెంట్లు, వెల్ఫేర్‌ అసిస్టెంట్‌లు, సచివాలయ సెక్రటరీలు, అసిస్టెంట్‌ సెక్రటరీలు తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. అనంతపురంలోని జాయింట్‌ డైరెక్టర్‌ కార్యాలయం, హిందూపురం డివిజన కార్యాలయం, కదిరి ఆర్డీఓ కార్యాలయాల్లో రెండురోజుల పాటు శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపా రు. ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రూట్‌ ఇనచార్జ్‌లు, మెంటార్లు, రూట్‌ ఇనచార్జ్‌లు  శి క్షణలో పాల్గొనాలన్నారు. వీడియో కాన్ఫరెన్సలో పశుసంవర్థక శాఖ జేడీ వెంకటేష్‌, పీఆర్‌ ఎస్‌ఈ భా గ్యరాజ్‌, జిల్లా కో-ఆపరేటివ్‌ ఆఫీసర్‌ సుబ్బారావు, మిల్క్‌డైరీ డీడీ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement