600 ఎకరాల్లో పంట నష్టం

ABN , First Publish Date - 2020-04-09T10:53:42+05:30 IST

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ డివిజన్‌ పరిధిలో రెండు రోజులుగా ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాల వల్ల దాదాపు 600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది

600 ఎకరాల్లో పంట నష్టం

నారాయణఖేడ్‌, ఏప్రిల్‌ 8: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ డివిజన్‌ పరిధిలో రెండు రోజులుగా ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాల వల్ల దాదాపు 600 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నారాయణఖేడ్‌లో మంగళవారం 12.8 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదు కాగా బుధవారం 2.6 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది.


నారాయణఖేడ్‌ మండలంలో 162 ఎకరాల్లో వరి పంటకు, సిర్గాపూర్‌లో జొన్నపంటకు 236ఎకరాల్లో,  కల్హేర్‌ మండలంలో 104 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. అలాగే సిర్గాపూర్‌లో రెండెకరాల్లో మొక్కజొన్న పంటకు, మూడు ఎకరాల్లో స్వీట్‌కార్న్‌ పంటకు నష్టం చేకూరింది. ఈ మేరకు నష్టం అంచనాలను రూపొందించినట్లు వ్యవసాయ శాఖ ఏడీఏ కరుణాకర్‌రెడ్డి బుధవారం తెలిపారు. నారాయణఖేడ్‌ మండలంలోని లింగాపూర్‌లో ఇళ్లపైకప్పులు కూడా ఈదురుగాలులకు ఎగిరిపోయాయని గ్రామస్థులు పేర్కొన్నారు. 

Updated Date - 2020-04-09T10:53:42+05:30 IST