Abn logo
Nov 22 2020 @ 21:34PM

జమ్మూకశ్మీర్‌లో మరో భారీ సొరంగం గుర్తింపు

Kaakateeya

న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో శాంతిని విచ్ఛిన్నం చేసేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు చేస్తున్న కుట్ర మరోమారు బయటపడింది. సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వద్ద ‘నగ్రోటా’ ఉగ్రవాదులు ఉపయోగించినట్టుగా చెబుతున్న భారీ సొరంగం ఒకటి బయటపడింది. 5X5 వ్యాసంతో ఉన్న ఈ సొరంగం 150 మీటర్ల పొడవు ఉంది. అంతర్జాతీయ సరిహద్దు వద్ద రీగల్ ప్రాంతంలో దట్టంగా పెరిగిన మొక్కలను తొలగిస్తున్న సమయంలో ఈ సొరంగం బయటపడింది. 


గురువారం నగ్రోటా సమీపంలోని బాన్‌లో పోలీసులు, భద్రతా దళాల చేతిలో జైషే మహ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి 11 ఏకే అసాల్ట్ రైఫిల్స్, మూడు పిస్టల్స్, 29 గ్రనేడ్లు, ఆరు యూబీజీఎల్ గ్రేనేడ్లు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లో త్వరలో జరగనున్న డిస్ట్రిక్ట్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ ఎన్నికలను విచ్ఛిన్నం చేసేందుకే వీరు భారత్‌లో ప్రవేశించినట్టు పోలీసులు తెలిపారు. జమ్మూకశ్మీర్‌లో మొత్తం 8 విడతలుగా ఎన్నికలు జరగనుండగా, తొలి విడత ఎన్నికలు ఈ నెల 28న జరగనున్నాయి.  

Advertisement
Advertisement